ఆ ప్రమాదం జరగకపోతే.. యామీ గౌతమ్ కలెక్టర్ అయ్యేదా?

by  |
ఆ ప్రమాదం జరగకపోతే.. యామీ గౌతమ్ కలెక్టర్ అయ్యేదా?
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ యామీ గౌతమ్ బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. 2021లో అభిమానులను అలరించేందుకు క్రేజీ ప్రాజెక్ట్స్ రెడీ చేస్తోంది. ఈ క్రమంలో ఐఏఎస్ కావాలనుకున్న తన డ్రీమ్.. ఓ రోడ్డు ప్రమాదం కారణంగా ఎలా చెదిరిపోయిందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. చండీగఢ్‌లో యూనివర్సిటీకి బైక్‌పై వెళ్తున్న క్రమంలో ముందుగా వెళ్తున్న కారు రాంగ్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రమాదం జరిగిందని తెలిపింది. రైట్ వెళ్తున్నానని సిగ్నల్ ఇచ్చి, సడెన్‌గా లెఫ్ట్ తీసుకోవడంతో జరిగిన యాక్సిడెంట్‌లో పడిపోయానని, కదలలేని స్థితిలో ఉన్న తనకు ఓ వ్యక్తి హెల్ప్ చేశాడని చెప్పింది. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రాణాలతో బయటపడ్డానన్న యామీ.. వింటర్‌లో లేయర్డ్ క్లాత్స్ ధరించడం వల్ల బయటకు కనిపించేలా గాయాలు కాలేదు కానీ, నెక్ ఫ్రాక్చర్ అయిందని తెలిపింది. దీంతో తానెప్పుడూ వర్కౌట్ చేయకూడదని డాక్టర్లు చెప్పారని, ఎడ్యుకేషన్ విషయంలోనూ ఎక్కువగా స్ట్రెయిన్ అవకూడదని చెప్పడంతో ఐఏఎస్ కావాలనుకున్న తను యాక్టర్‌గా సెటిల్ అయిపోవాల్సి వచ్చిందని తెలిపింది.


Next Story

Most Viewed