ఫెయిర్ అండ్ లవ్‌లీ’ అంటే కోపగించుకున్న హీరోయిన్.. ఎందుకంటే ?

by  |
ఫెయిర్ అండ్ లవ్‌లీ’ అంటే కోపగించుకున్న హీరోయిన్.. ఎందుకంటే ?
X

దిశ, సినిమా : గతంలో పలు ఫెయిర్‌నెస్ ప్రొడక్ట్స్‌ ఎండార్స్‌మెంట్స్‌లో నటించిన బాలీవుడ్ నటి యామీ గౌతమ్.. ప్రస్తుతం తన దగ్గర ఆ విషయాన్ని ప్రస్తావిస్తే మండిపడింది. ఇటీవలే తన అప్‌కమింగ్ ఫిల్మ్ ‘భూత్ పోలీస్’కు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్‌కు హాజరైన యామీని.. ఒక ఫొటోగ్రాఫర్ ‘ఫెయిర్ అండ్ లవ్‌లీ.. ఇటు చూడండి’ అని పిలవడంతో రియాక్ట్ అయింది. ఇంతకుముందు తను సదరు బ్రాండ్‌కు ఎండార్స్‌మెంట్ చేయడంతోనే అతను ఆ పేరుతో పిలిచాడు. అయితే ప్రస్తుతానికి ఈ బ్రాండ్ వాల్యూ మార్కెట్‌లో తగ్గిపోయి ఉండవచ్చు కానీ, యామీ మాత్రం ఆ ప్రస్తావన అంగీకరించడానికి నిరాకరించింది. ఇదే క్రమంలో ‘మరోసారి ధైర్యంగా చెప్పండి’ అంటూ రిప్లయ్ ఇచ్చిన నటి.. అలాంటి పేర్లు వాడకుండా గౌరవంగా పిలవాలని సూచించింది. ఇక యామీ నటించిన ‘భూత్ పోలీస్’ సెప్టెంబర్ 17న డిస్నీ+హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుండగా.. ఈ హార్రర్ కామెడీ మూవీలో సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.



Next Story

Most Viewed