- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాదాద్రి దేవస్థాన ఆచార్యులకు బెదిరింపు కాల్
<p>దిశ, నల్లగొండ: యాదగిరిగుట్ట దేవస్థాన ఆచార్యులు సందుగుల రాఘవాచార్యులకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేశాడని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. దేవస్థాన దస్త్రాల విషయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆచార్యులకు ఫోన్‌చేసి బెదిరించినట్టు ఫిర్యాదు అందిందన్నారు. వారం రోజుల కిందట..ఉదయం ఆలయానికి వెళ్లి నిత్య కైంకర్యాలు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లిన రాఘవా చార్యులకు రాత్రి 2 గంటల ప్రాంతంలో గుర్తు […]</p>

దిశ, నల్లగొండ: యాదగిరిగుట్ట దేవస్థాన ఆచార్యులు సందుగుల రాఘవాచార్యులకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేశాడని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. దేవస్థాన దస్త్రాల విషయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆచార్యులకు ఫోన్‌చేసి బెదిరించినట్టు ఫిర్యాదు అందిందన్నారు. వారం రోజుల కిందట..ఉదయం ఆలయానికి వెళ్లి నిత్య కైంకర్యాలు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లిన రాఘవా చార్యులకు రాత్రి 2 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. అయితే ఈ వ్యవహారాన్ని దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని యాదగిరి గుట్ట దేవస్థాన ఆచార్యులు తెలిపారు.
tags : yadadri temple priest, unknown person, call, warning, documents






