యాదాద్రి టెంపుల్ పున:ప్రారంభ నిర్ణయం ఆయనదే..!

by  |
యాదాద్రి టెంపుల్ పున:ప్రారంభ నిర్ణయం ఆయనదే..!
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : యాదాద్రి పునర్మిర్మాణ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. పెండింగ్‌లో ఉన్నవి కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి కొద్ది రోజుల్లోనే ముగింపు పలకనున్నారు. కానీ ఆలయ పున:ప్రారంభానికి ముహూర్తం లేకపోవడంతో మే నెల వరకు ఆగాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు గురువారం యాదాద్రి వెళ్తున్నారు. పెండింగ్ పనులు, కొత్తగా చేపట్టాల్సిన వాటి విషయమై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

గడువు నాటికి పనుల్లో వేగవంతం..

ఏప్రిల్ నెలాఖరు వరకు సంబంధిత పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఆ మేరకు ఏ పనులు ఎప్పటిలోగా పూర్తి చేయాలన్న విషయమై గడువు ఖరారు చేశారు. అటు రింగ్ రోడ్డు​కు సంబంధించి మెట్ల మార్గం సమీపంలో ఉన్న నిర్మాణాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. సైదాపురంలో ఆర్టీసీ బస్ డిపో, బస్టాండ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

అంతిమ నిర్ణయం చినజీయర్‌స్వామిదే..

యాదాద్రి క్షేత్రంలో సాగుతున్న పనులు ఆయా ప్రాంతాలను సీఎం కేసీఆర్ గురువారం స్వయంగా పరిశీలించనున్నారు. ఆదివారమే సీఎం పర్యటన ఉన్నా అదీ గురువారానికి వాయిదా పడింది. పనుల పరిశీలన అనంతరం చినజీయర్​ స్వామిని సంప్రదించి ప్రధానాలయ పున:ప్రారంభ ముహూర్తాన్ని ముఖ్యమంత్రి ఖరారు చేసే అవకాశం ఉంది. మే మూడో తేదీ వరకు మంచి రోజులు లేకపోవడంతో రెండో వారంలో యాదాద్రి ఆలయ పున:ప్రారంభం ఉండనుందనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి.


Next Story

Most Viewed