- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరిహారం విషయంలో… జాప్యం చేయొద్దు
by Shyam |
<p>దిశ, భువనగిరి: యాదాద్రి-భువనగిరి జిల్లా రైతాంగానికి సాగు నీరందించే కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్మాణాల భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అనితారాంచంద్రన్ ఆదేశించారు. గురువారం సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాల్వల నిర్మాణ ప్రకృయలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం అందించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించొద్దని తెలిపారు. కాళేశ్వరం ప్యాకేజీ 14, 15, 16 భూ సేకరణ, దేవాదుల ప్రాజెక్టుల భూసేకరణ పనులపై ఎస్ఈ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, రెవెన్యూ […]</p>

X
దిశ, భువనగిరి: యాదాద్రి-భువనగిరి జిల్లా రైతాంగానికి సాగు నీరందించే కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్మాణాల భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అనితారాంచంద్రన్ ఆదేశించారు. గురువారం సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కాల్వల నిర్మాణ ప్రకృయలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం అందించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించొద్దని తెలిపారు. కాళేశ్వరం ప్యాకేజీ 14, 15, 16 భూ సేకరణ, దేవాదుల ప్రాజెక్టుల భూసేకరణ పనులపై ఎస్ఈ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Next Story






