- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షావోమీ నుంచి మరో ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్?
<p>ఓ వైపు చైనా ఉత్పత్తులను నిషేధించాలంటూ ప్రముఖులు ప్రచారం చేస్తుంటే, చైనా స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి సంస్థ షావోమీ మాత్రం ఒకదాని వెనక ఒకటిగా తమ ఉత్పత్తులను భారత మార్కెట్‌లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ వారంలో ల్యాప్‌టాప్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన షావోమీ.. ఇప్పుడు కొత్తగా మరో ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌ను కూడా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ట్విట్టర్‌లో ఎంఐ ఇండియా ఖాతా ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఎలక్ట్రిక్ బటన్ ఉన్న […]</p>

ఓ వైపు చైనా ఉత్పత్తులను నిషేధించాలంటూ ప్రముఖులు ప్రచారం చేస్తుంటే, చైనా స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి సంస్థ షావోమీ మాత్రం ఒకదాని వెనక ఒకటిగా తమ ఉత్పత్తులను భారత మార్కెట్‌లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ వారంలో ల్యాప్‌టాప్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన షావోమీ.. ఇప్పుడు కొత్తగా మరో ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌ను కూడా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ట్విట్టర్‌లో ఎంఐ ఇండియా ఖాతా ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఎలక్ట్రిక్ బటన్ ఉన్న బ్రష్‌ను చూపిస్తూ.. మీలో ఎంతమంది మాన్యువల్‌గా బ్రష్ చేయడానికి ఇంకా ఇబ్బందిపడుతున్నారు? అని క్యాప్షన్ పెట్టింది. ఇది భారత మార్కెట‌్‌లో షావోమీ విడుదల చేయబోతున్న రెండో ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ కాగా.. ఫిబ్రవరిలో ఎంఐ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ టి300 పేరుతో ఒకదాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని ధర రూ. 1299/- కాగా, ఈ కొత్త టూత్‌బ్రష్‌కు ప్రో బ్రషింగ్ అని పేరు కూడా పెట్టింది.






