రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా షియోమీ

by  |
రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా షియోమీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా యాపిల్‌ను అధిగమించింది. షియోమీ గత త్రైమాసికంలో 83 శాతం సరఫరా పెరుగుదల నమోదు చేయడం ద్వారా ఈ ఘనతను సాధించింది. ప్రముఖ పరిశోధనా సంస్థ కానలిస్ ప్రకారం.. ఈ విభాగంలో శాంసంగ్, యాపిల్ తర్వాత షియోమీ ఇటీవల దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే మొదటిసారి శాంసంగ్ తర్వాత రెండో స్థానాన్ని దక్కించుకుంది.

ప్రస్తుత ఏడాది రెండో త్రైమాసికంలో శాంసంగ్ 19 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 17 శాతంతో షియోమీ రెండో స్థానంలోకి చేరుకుంది. యాపిల్ 14 శాతంతో మూడో స్థానానికి పరిమితమైంది. 2021లో షియోమీ కంపెనీ ఎంఐ11 తీసుకురావడం ద్వారా స్మార్ట్‌ఫోన్ విభాగంలో అతిపెద్ద కెమెరా సెన్సార్లలో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ప్రవేశించేందుకు షియోమీ ప్రయత్నానికి ఇది పునాది అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇక, సగటు అమ్మకాల ధర పరంగా చూస్తే శాంసంగ్ కంటే 40 శాతం, యాపిల్ కంటే 75 శాతం తక్కువ కావడం వల్ల ఈ విభాగంలో షియోమీ గట్టి పోటీని ఇవ్వగలుగుతోందని’ షియోమీ రీసెర్చ్ మేనేజర్ బెన్ స్టాంటన్ అన్నారు. ఈ ఏడాదిలో హై-ఎండ్ మోడళ్ల విక్రయాల ద్వారా షియోమీ తన బ్రాండ్ పతిష్ఠతకు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు బెన్ వెల్లడించారు.
Next Story

Most Viewed