శ్రీవారి సేవలో జాన్వీ కపూర్.. వీడియో వైరల్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-04 05:45:28  IST  )

బాలీవుడ్ కమ్ టాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తిరుమలకు విచ్చేశారు. అలిపిరి మెట్లమార్గం మీదుగా కాలినడకన ఏడుకొండలు ఎక్కి.. మొక్కు తీర్చుకున్నారు.

శ్రీవారి సేవలో జాన్వీ కపూర్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ కమ్ టాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తిరుమలకు విచ్చేశారు. అలిపిరి మెట్లమార్గం మీదుగా కాలినడకన ఏడుకొండలు ఎక్కి.. మొక్కు తీర్చుకున్నారు. అనంతరం తన పిన్ని, నటి మహేశ్వరితో కలిసి స్వామివారిని దర్శించుకుని, శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. జాన్వీకపూర్ మెట్లమార్గంలో రెస్ట్ తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. జాన్వీకపూర్, రామ్ చరణ్ జంటగా.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్స్, మార్నింగ్ షోలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలియాలంటే రేపటి వరకూ వేచి ఉండాల్సిందే. కాగా.. బాక్సాఫీస్ వద్ద పెద్ది సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది.

Next Story