కాక రేపుతున్నW W W టీజ‌ర్.. హీరోయిన్ ఎవరంటే ?

by  |
www
X

దిశ, సినిమా : ‘118’ వంటి స‌క్సెస్‌ఫుల్‌ మూవీ తర్వాత ప్రముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహన్ రూపొందిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ ‌‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు(ఎవ‌రు, ఎక్కడ‌, ఎందుకు)’. అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఇప్పటికే విడుద‌లైన టీజ‌ర్, సాంగ్స్ సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేశాయి. కాగా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్షన్స్ భాగ‌స్వామ్యంతో థియేట‌ర్స్‌లో రిలీజ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా స్టార్ ప్రొడ్యూస‌ర్ సురేష్‌బాబు మాట్లాడుతూ.. సినిమాను క్రిస్పీ నెరేష‌న్‌తో చాలా థ్రిల్లింగ్‌గా తీశారని, అంత‌ర్లీనంగా మంచి ప్రేమ‌క‌థ కూడా ఉందని తెలిపారు.

ఇక తమ బేన‌ర్‌లో రూపొందిన ఫ‌స్ట్ మూవీ ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ చిత్రానికి సురేష్ ప్రొడ‌క్షన్స్ స‌మ‌ర్పకులుగా వ్యవ‌హరించ‌డం చాలా సంతోషంగా ఉందని నిర్మాతలు డాక్టర్ రవి ప్రసాద్, రాజు దాట్ల వెల్లడించారు. తెలుగులో వస్తున్న మొదటి కంప్యూటర్‌ స్క్రీన్‌ మూవీ ఇదేనని, గుహ‌న్‌ మేకింగ్ చాలా కొత్తగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. చిత్ర ద‌ర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అదిత్‌, శివాణి చాలా బాగా న‌టించారని, టెక్నీషియ‌న్స్ అంద‌రూ మంచి స‌పోర్ట్ అందించారని అన్నారు. ప్రియదర్శి, వైవా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్న చిత్రానికి సైమన్‌ కె. కింగ్ సంగీతం అందించగా.. రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్‌తో పాటు రోల్‌రైడా లిరిక్స్ అందించడం విశేషం.



Next Story

Most Viewed