టెట్ రాయాల్సిందే.. ఉద్యోగులకు వేరే మార్గం లేదు!

by Ravi |   (  Updated:2025-11-18 00:30:14  IST  )

తెలంగాణ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వేలాది మంది ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఐదేళ్లకు పైగా సర్వీస్ ఉన్నవారికి టెట్ తప్పనిసరి అని ఎన్సీటీఈ స్పష్టీకరణ వీరికి తలనొప్పిగా మారింది.

టెట్ రాయాల్సిందే.. ఉద్యోగులకు వేరే మార్గం లేదు!
X

తెలంగాణ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వేలాది మంది ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఐదేళ్లకు పైగా సర్వీస్ ఉన్నవారికి టెట్ తప్పనిసరి అని ఎన్సీటీఈ స్పష్టీకరణ వీరికి తలనొప్పిగా మారింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ‘టెట్ ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను పెంచడానికి అవసరం. విద్యా నాణ్యత కోసం ఇది కీలకం’ ఈ నేపథ్యంలో 2010 తర్వాత నియామకం పొందిన ప్రతి ఉపా ధ్యాయుడు తప్పనిసరిగా టెట్ పాసై ఉండాలనే నియమాన్ని ఇటీవల ఎన్సీటీఈ మరోసారి దృవీకరించింది. దీంతో గతంలో టెట్ రాయకుండానే నియా మకం పొందిన అనేక మంది టీచర్లు రెండేళ్లలో పరీక్ష పాస్ కాకుంటే ఉద్యోగం కోల్పోవాల్సిన ప్రమాదంలో పడ్డారు. దీంతో టెట్ అర్హత లేని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇప్పుడు తప్పనిసరిగా టెట్ పేపర్–2లో ఉత్తీర్ణత సాధించాల్సిందే. లేకుంటే పదోన్నతులు నిలిచి‌పోవడంతో పాటు సర్వీసు కొనసాగించే అవకాశం కూడా ఉండదు. ఇంతకుముందు 2012కు ముందు ఉద్యోగాల్లో చేరిన వారికి మిన హాయింపు లభించింది. కానీ ఇప్పుడు అలా కాదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్ అర్హత లేని అందరికీ టెట్ తప్పనిసరిగా మారింది. ఉపాధ్యాయ సంఘాలు టెట్ అంశంపై ఎన్నో విన్నపాలు చేసినప్పటికీ ఎన్సీటీఈ తిరస్కరించడం వల్ల ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష రాయడం తప్పడం లేదు. ఈ పరీక్షను ప్రభుత్వం రెండు సంవత్సరాల వ్యవధిలో నాలుగుసార్లు నిర్వహించనుంది. ప్రభుత్వం కల్పించే ఈ నాలుగు అవ కాశాల్లో ఏదో ఒకసారి క్వాలిఫై కావాల్సిందే. ఆన్‌లైన్ విధానాన్ని అనుసరించడం వల్ల అక్రమాలకు సైతం అవకాశం ఉండదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉపాధ్యాయులు పుస్తకాలు కొని చదువు మొదలు పెట్టారు. అయితే సంవత్సరాల తర్వాత పరీక్ష రాయాల్సి రావడంతో చాలామంది ఒత్తిడిలో ఉన్నారు. టెట్ పాస్ కాకపోతే ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తుందనే భయం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.

-రావుల రాజేశం

77801 85674

Next Story