- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అచ్చు గుద్దినట్టు’.. అచ్చం అలానే జరుగుతున్నదే!
<p>ఏదైనా విపత్తు సంభవించినపుడు పెద్దల నోట ఏం ధ్వనిస్తుంది? వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిందే జరుగుతున్నదనీ! ఇపుడు మనకో మహాశయుడు గుర్తుకొచ్చేలా చేస్తోంది కరోనా! అది సోకిన వ్యాధికి సాంకేతికంగా పెట్టిన పేరు కోవిడ్-19. నిజానికి దానికి పుష్కర కాలం కిందటే ఓ రచయిత అక్షర రూపమిచ్చాడు. తన పుస్తకంలో అచ్చు గుద్దినట్టే, అచ్చం అలానే.. దాదాపు మన అనుభవంలోకి వచ్చింది. చైనా, ఇండియా, జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ, జపాన్, అమెరికా వంటి నాలుగు డజన్లకుపైగా […]</p>

ఏదైనా విపత్తు సంభవించినపుడు పెద్దల నోట ఏం ధ్వనిస్తుంది? వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిందే జరుగుతున్నదనీ! ఇపుడు మనకో మహాశయుడు గుర్తుకొచ్చేలా చేస్తోంది కరోనా! అది సోకిన వ్యాధికి సాంకేతికంగా పెట్టిన పేరు కోవిడ్-19. నిజానికి దానికి పుష్కర కాలం కిందటే ఓ రచయిత అక్షర రూపమిచ్చాడు. తన పుస్తకంలో అచ్చు గుద్దినట్టే, అచ్చం అలానే.. దాదాపు మన అనుభవంలోకి వచ్చింది. చైనా, ఇండియా, జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ, జపాన్, అమెరికా వంటి నాలుగు డజన్లకుపైగా దేశాలకు కంటి మీద కునుకు దూరమై దుమారం రేపుతున్న కరోనా పోలికలను ఆ పుస్తకంలో అచ్చు వేశారు. అది రాసింది సిల్వియా బ్రౌన్. ‘ఎండ్ ఆఫ్ డేస్’ అనే పుస్తకంలో ప్రస్తుత వైరస్ గురించి ప్రస్తావించారు. 2008 నాటి ఆ బుక్కు 312వ పేజీలోని ఒక పేరాను మనం హైలైట్ చేసుకోవచ్చు. ఆ పేరాలోని మేటరే, ఇపుడు మనం వింటున్నాం, కంటున్నాం. ప్రపంచంలో కొందరు టపా కట్టారు. భారత్ సహా అనేక కంట్రీల్లో బాధితులయ్యారు. ఎటుపోయి ఎటు చుట్టుకుంటుందోననీ తెగ కంగారు పెట్టిస్తున్న కరోనా గురించి బ్రౌన్ ఊహాశక్తికి అందడం ఆశ్చర్యకరమే. ఇంతకీ తాను ఆ పుస్తకంలో పేర్కొన్న దాని సారాంశం ఏమంటే.. 2020లో న్యూమోనియా సంబంధిత ప్రాణాంతక జబ్బుకు విశ్వంలోని ఒక దేశంలో బీజం పడి.. క్రమంగా ప్రపంచాన్నే చుట్టేస్తుంది. అకాల మరణాలకు ఆజ్యం పోస్తుంది. అనేక మందిని రోగగ్రస్తులను చేస్తుంది. అనంతమైన అలజడి రేపుతుంది. కొన్నాళ్లకు సద్దుమణుగుతుంది. మళ్లీ పదేండ్లకు అంటే 2030 కల్లా అట్లాంటిదే విజృంభిస్తుంది. 2050 కల్లా ప్రపంచంలోనే పెను విపత్తు తెచ్చి, సమస్త జంతు జీవ జాలాన్ని కబళిస్తుందంటూ భవిష్యత్ దర్శనం చేశారు. మున్ముందటి సంగతేమిటో కానీ.. ప్రస్తుతానికైతే, సేమ్ అట్లే కరోనా ఆగం చేస్తున్నది.
tags : corona effect, one country, total world spread, writer sylvia browne mention in end of days book in 2008






