పెరిగిన టోకు ద్రవ్యోల్బణం

by  |

దిశ, వెబ్‌డెస్క్: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 2.03 శాతానికి పెరిగింది. డిసెంబర్‌లో తయారీ వస్తువుల కారణంగా ఇది 1.22 శాతంగా నమోదైంది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం గతేడాది జనవరిలో 3.52 శాతంగా నమోదైనట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో నమోదైన 4.24 శాతంతో పోలిస్తే జనవరిలో 5.13 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం -2.24 శాతం, కూరగాయలు -20.82 శాతం, బంగాళదుంపల ద్రవ్యోల్బణం -22.04 శాతంగా నమోదైనట్టు గణాంకాలు తెలిపాయి.

‘2021 జనవరిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ప్రాథమిక ఆహార ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, తయారైన ఆహారేతర ఉత్పత్తులు, ఇంధనం, విద్యుత్, ముడి పెట్రోలియం, సహజవాయువు పెరిగాయని’ ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ చెప్పారు. జనవరి నెలకు సంబంధించి సీపీఐ ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నామని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, ఈ నెల 5న జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన సమావేశంలో వరుసగా నాలుగో సారి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. సమీపకాలంలో ద్రవ్యోల్బణం అనుకూలంగా మారుతుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed