ఈ క్రికెటర్ హైట్ చూశారా?

by  |
ఈ క్రికెటర్ హైట్ చూశారా?
X

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్‌లో పుట్టిన ముదస్సర్ గుజ్జర్ వయస్సు 21.. అతని ఎత్తు 7 అడుగుల 1 అంగుళం. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. ఇంతటి ఎత్తున్న వ్యక్తులను మనం చాలా మందినే చూసి ఉంటాం. కానీ ఇంత ఎత్తున్న క్రికెటర్‌ను మాత్రం చూసి ఉండము. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టుకు ఎంపికయ్యాడు. ఫాస్ట్ బౌలింగ్ చేసే ముదస్సర్ కనుక పీఎస్ఎల్‌లో రాణిస్తే త్వరలోనే అతడిని మనం అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా చూడవచ్చు.

ముదస్సర్ తల్లిదండ్రులు సాధారణ ఎత్తే ఉంటారు. తండ్రి మొహమ్మద్ 5.6 అడుగులు, తల్లి 5.3 అడుగులు ఉన్నది. కానీ గుజ్జర్ మాత్రమే ఇలా అసాధారణ ఎత్తు పెరిగాడు. హార్మోన్ల ప్రభావం వల్లే అతడు ఇంత ఎత్తు పెరిగినట్లు డాక్టర్లు చెప్పారు. అయితే అతడికి చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఆసక్తి ఉన్నది. దీంతో కాలేజీకి వచ్చే సరికి ఫాస్ట్ బౌలింగ్‌లోమెలకువలు నేర్చకున్నాడు. ప్రస్తుతం లాహోర్ ఖలందర్స్ టీమ్ యాజమాన్యం అతడిని ప్రోత్సహించడానికి నిర్ణయం తీసుకున్నది.

Next Story

Most Viewed