- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెస్‌లో ప్రైజ్ మనీగా బిట్ కాయిన్
<p>దిశ, స్పోర్ట్స్ : ప్రపంచ చదరంగం చరిత్రలో తొలి సారిగా క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్‌ను ప్రైజ్ మనీగా ఇవ్వబోతున్నారు. ఆదివారం ప్రారంభమైన ది మెల్ట్‌వాటర్ చాంపియన్స్ టూర్‌లో భాగంగా ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కరెన్సీ టోర్నీలో విజేతకు ఈ మేరకు బిట్ కాయిన్‌ను అందించనున్నాను. వర్చువల్ విధానంలో జరుగుతున్న ఈ చెస్ టోర్నీలో ప్రపంచ వ్యాప్తంగా పలువురు గ్రాండ్ మాస్టర్లు పాల్గొంటున్నారు. కాగా విజేతకు 1.5 లక్షల డాలర్లు ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు. ఇందులో 50 వేల డాలర్లు […]</p>

దిశ, స్పోర్ట్స్ : ప్రపంచ చదరంగం చరిత్రలో తొలి సారిగా క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్‌ను ప్రైజ్ మనీగా ఇవ్వబోతున్నారు. ఆదివారం ప్రారంభమైన ది మెల్ట్‌వాటర్ చాంపియన్స్ టూర్‌లో భాగంగా ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కరెన్సీ టోర్నీలో విజేతకు ఈ మేరకు బిట్ కాయిన్‌ను అందించనున్నాను. వర్చువల్ విధానంలో జరుగుతున్న ఈ చెస్ టోర్నీలో ప్రపంచ వ్యాప్తంగా పలువురు గ్రాండ్ మాస్టర్లు పాల్గొంటున్నారు. కాగా విజేతకు 1.5 లక్షల డాలర్లు ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు. ఇందులో 50 వేల డాలర్లు చెక్ రూపంలో మిగిలిన 1 లక్ష డాలర్లు బిట్ కాయిన్ల రూపంలో అందించనున్నారు. బిట్ కాయిన్‌కు మరింత ప్రచారం తీసుకొని రావడానికే ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, చదరంగం చరిత్రలో అత్యధిక ప్రైజ్ మనీ ఇవ్వనున్న టోర్నీగా కూడా ఇది రికార్డులకు ఎక్కింది. మరోవైపు వర్చువల్ విధానంలో ఈ మ్యాచ్ జరుగుతుండగా లైవ్‌లో బిట్ కాయిన్ విలువకు సంబంధించిన హెచ్చుతగ్గులను కూడా స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు.






