నన్ను హిందువు కాదంటున్నారు.. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-29 13:52:31  IST  )

శివాజీ వ్యాఖ్యలను ఖండించిన అనంతరం ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణపై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్వేష్ తాను చెప్పాలని అనుకున్నది చెప్పకుండా శివాజీని పచ్చి బూతులు తిట్టారు.

నన్ను హిందువు కాదంటున్నారు.. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సంచలన వ్యాఖ్యలు
X

అన్వేష్ తాను చెప్పాలని అనుకున్నది చెప్పకుండా శివాజీని పచ్చి బూతులు తిట్టారు.

తను హిందువు కాదని అంటున్నారని.. అది చెప్పడానికి మీరు ఎవరు అని ప్రశ్నించాడు.

శివాజీ వ్యాఖ్యలను ఖండించిన అనంతరం ప్రపంచ యాత్రికుడు పై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: శివాజీ వ్యాఖ్యలను ఖండించిన అనంతరం ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణపై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్వేష్ తాను చెప్పాలని అనుకున్నది చెప్పకుండా శివాజీని పచ్చి బూతులు తిట్టారు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. కొంతమంది అన్వేష్ హిందువు కాదని ఇతర మతస్తుడు అని విదేశాల్లో స్థిరపడ్డాడని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్వేష్ ఓ వీడియోను విడుదల చేశాడు.

తను హిందువు కాదని అంటున్నారని.. అది చెప్పడానికి మీరు ఎవరు అని ప్రశ్నించాడు. తాను కిలిమంజారో కొండ ఎక్కి వినాయకుడి పూజ చేశానని చెప్పాడు. ఉపవాసం ఉంటూ మహాభారతాన్ని చెప్పానని అన్నాడు. రేపు రామాయణం కూడా చెబుతానని వ్యాఖ్యానించాడు. భగవద్గీత కూడా చెబుతానని తెలిపాడు. తాను హిందూ ధర్మంలో పుట్టానని తన వద్ద అన్ని దేశాల పాస్ పోర్టులు ఉన్నాయన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలకు వెళ్లి వీడియోలు తీశానని అన్నాడు. దేశంలో లేకపోయినా ప్రతిఏడాది పన్నులు కడుతూ తాను దేశం రుణం తీర్చుకుంటున్నానని చెప్పాడు.

Next Story