యువతను కుల, మతాల పేరుతో నాశనం చేస్తున్నారు.. చైనాను చూపిస్తూ బోరున ఏడ్చేసిన అన్వేష్

by Ajay Maddhiboyina |

ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న అన్వేష్ చైనా టెక్నాలజీపై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో భారతదేశ పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

యువతను కుల, మతాల పేరుతో నాశనం చేస్తున్నారు.. చైనాను చూపిస్తూ బోరున ఏడ్చేసిన అన్వేష్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న అన్వేష్ చైనా టెక్నాలజీపై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో భారతదేశ పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రోబోలు అన్ని ఉద్యోగాలు తీసుకుపోతే జెన్ జీ, అల్ఫా జనరేషన్ లు ఎలా బతుకుతాయని ప్రశ్నించారు. యవత కష్టపడి చదువుకుంటే మన దేశం కూడా చైనాలా మారుతుందని అన్నారు. మతం కోసం, కులం కోసం కొట్టుకుని చావొద్దని చేతులెత్తి దండం పెట్టారు. ఇప్పటికే రోబోల వల్ల ట్యాక్సీ డ్రైవర్ల ఉద్యోగాలు, రెస్టారెంట్లలో వెయిటర్ ల ఉద్యోగాలు పోయాయన్నారు. కుల మతాల పేరుతో ప్రజలను దొంగనాయకులు విడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చైనా భారత్ కంటే వంద సంవత్సరాలు ముందు ఉందని అన్నారు. పొద్దున లేస్తే భారత యువత కులం, మతం పేరుతో కొట్టుకుచస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దేశాన్ని దేవుడే కాపాడాలని లేదంటే సర్వనాశనం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా అన్వేష్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తిరిగి ఇటీవలే వీడియోలు చేయడం మొదలు పెట్టారు. గతంలో చైనాలో పర్యటించినప్పటికీ మరోసారి ఆదేశంలోనే పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో చైనా టెక్నాలజీపై ప్రశంసలు కురిపిస్తుంటే అది మనకు శత్రుదేశం అంటూ కొందరు అన్వేష్ ను విమర్శిస్తున్నారు.

Next Story