- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తన మలాన్ని అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్న యువకుడు.. ఇది సరదాకోసం కాదు!

దిశ, వెబ్‌డెస్క్: వినూత్నంగా ఆలోచిస్తే.. డబ్బు సంపాదించేందుకు ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. ఓ యువకుడు తన మలాన్ని అమ్మి గతేడాది రూ.3.4 లక్షలు సంపాదించాడు. అంటే నెలకు సుమారు రూ.28,333 ఆదాయం పొందాడు. ఇలా చేసేది అతని సరదాలు తీర్చుకోవడం కోసం కాదు. దీనిద్వారా వందలమంది ప్రాణాలను రక్షించాడు. కెనడాకు చెందిన యువకుడు చేస్తోన్న ఈ అసాధారణ ఉద్యోగం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. ఫేకల్ మైక్రోబయోటా ట్రాన్స్ ప్లాంటేషన్ (FMT) అనే వైద్య విధానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. చిల్లివాక్ నగరానికి చెందిన 20ఏళ్ల యువకుడు తన మల నమూనాలను ఒక వైద్య సంస్థకు విక్రయిస్తున్నాడు. వాటిని ఉపయోగించి క్లోస్ట్రిడియోయిడ్స్ డిఫిసిల్ అనే ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న రోగులకు చికిత్స చేస్తారు. దీనివల్ల తీవ్రమైన విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆరోగ్యంగా ఉన్న దాత నుంచి సేకరించినమలాన్ని శుద్ధిచేసి, రోగు పెద్దప్రేగులోకి ప్రవేశపెట్టడాన్ని FMT అంటారు. దీనివల్ల రోగి పేగుల్లో బ్యాక్టీరియా వృద్ధి చెంది, ఇన్ఫెక్షన్ నయమవుతుంది. గతేడాది 149 మల నమూనాలు ఇవ్వగా.. ఒక్కో శాంపిల్ కు 25 డాలర్లు (రూ.2300 Aprrox) చెల్లించినట్లు యువకుడు తెలిపాడు. తన మల నమూనాలతో 400 మంది రోగులు కోలుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నాడు.






