- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్స్ యూజర్లకు షాక్.. అసభ్య కంటెంట్ వివాదంపై ఆ సంస్థ కీలక నిర్ణయం
దిగ్గజ సోషల్ మీడియా యాప్ ‘ఎక్స్’ (ట్విట్టర్) సంస్థకు చెందిన కృత్రిమ మేధస్సు (ఏఐ) ‘గ్రోక్’ చాట్‌బాట్ సృష్టిస్తున్న అసభ్య, అశ్లీల కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో : దిగ్గజ సోషల్ మీడియా యాప్ ‘ఎక్స్’ (ట్విట్టర్) సంస్థకు చెందిన కృత్రిమ మేధస్సు (ఏఐ) ‘గ్రోక్’ చాట్‌బాట్ సృష్టిస్తున్న అసభ్య, అశ్లీల కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు గ్రోక్‌ను అశ్లీల, అసభ్యకర దృశ్యాల రూపకల్పనకు దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలపై ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఈ అంశంపై ప్రముఖ రాజకీయ నేతల నుంచి కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. భారత్‌తో పాటు పలు దేశాలు గ్రోక్ చాట్‌బాట్ దుర్వినియోగంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ‘ఎక్స్’ సంస్థ చర్యలకు ఉపక్రమించింది.
గ్రోక్‌కు పరిమితులు..
ఈ క్రమంలోనే గ్రోక్‌లోని ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌పై పరిమితులు విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇకపై ఈ ఫీచర్ కేవలం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఇటీవల స్పందించిన ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్.. గ్రోక్‌ను దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని యూజర్లను హెచ్చరించారు. ఆ హెచ్చరికలకు అనుగుణంగానే తాజాగా పరిమితులు విధించినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఎడాపెడా గ్రోక్‌ను ఉపయోగిస్తున్న యూజర్లకు ఇది పెద్ద షాక్‌గా మారింది.
క్రమంగా వికృత రూపం దాల్చిన గ్రోక్!
కాగా, గ్రోక్ అనేది x సంస్థ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధస్సు (AI) చాట్‌బాట్. 2023లో ఎలాన్ మస్క్ చొరవతో ఈ సంస్థ స్థాపించబడింది. ఈ చాట్‌బాట్‌కు మనుషులకున్నంత జ్ఞానం ఉందంటూ మొదట్లో ప్రచారం జరిగింది. ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో వినోదం, సమాచారం కోసం గ్రోక్‌ను తీసుకొచ్చారు. ప్రారంభ దశలో అడిగిన ప్రశ్నలకు చమత్కారంగా సమాధానాలు ఇస్తూ యూజర్లను ఆకట్టుకున్న గ్రోక్.. క్రమంగా వికృత రూపం దాల్చింది. అశ్లీల, అసభ్యకర కంటెంట్‌ను ఉత్పత్తి చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తడంతో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలోనే గ్రోక్ చాట్‌బాట్‌పై నియంత్రణలు విధిస్తూ ‘ఎక్స్’ కీలక నిర్ణయం తీసుకుంది.






