'X' సీఈవో లిండా రాజీనామా

by Muthe.Rajitha |

సోషల్ మీడియా దిగ్గజం 'X' సీఈవో లిండా యాకరినో(Linda Yaccarino) తన పదవికి రాజీనామా చేశారు.

X సీఈవో లిండా రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా దిగ్గజం 'X' సీఈవో లిండా యాకరినో(Linda Yaccarino) తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతా ద్వారా ఆమె ప్రకటించారు. 2023లో ఎలాన్ మస్క్(Elon Musk) చేతుల్లోకి ట్విటర్ వెళ్ళిన తర్వాత లిండా తొలి సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. "రెండేళ్ల ప్రయాణం అద్భుతంగా సాగింది. నన్ను నమ్మి భావప్రకటనా స్వేచ్చను రక్షించడం, సంస్థను ముందుకు తీసుకువెళ్లేందుకు బాధ్యతలు అప్పగించిన మస్క్ కు ధన్యవాదాలు. ఎక్స్ బృందంతో కలిసి పనిచేయడం సంతోషంగా, గర్వంగా ఉంది." అని లిండా ట్వీట్ చేశారు. లిండా రాజీనామా ప్రకటనపై మస్క్ సానుకూలంగా స్పందించారు. మీ అద్భుతమైన సేవలకు ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు.

Next Story