రెజ్లింగ్ లెజెండ్ WWE స్టార్ హల్క్ కన్నుమూత!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-24 16:34:22  IST  )

రెజ్లింగ్ లెజెండ్ హల్క్ హోగన్ 71 గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని TMZ స్పోర్ట్స్ నివేదించింది. హల్క్ ఫ్లోరిడాలోని తన నివాసంలో

రెజ్లింగ్ లెజెండ్ WWE స్టార్ హల్క్ కన్నుమూత!
X

దిశ‌, వెబ్ డెస్క్: రెజ్లింగ్ లెజెండ్ హల్క్ హోగన్ 71 గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని TMZ స్పోర్ట్స్ నివేదించింది. హల్క్ ఫ్లోరిడాలోని తన నివాసంలో గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించగా మరణించినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల హల్క్ కోమాలో ఉన్నారని వార్తలు రాగా ఆయన భార్య వాటిని ఖండించింది. ఆయన గుండె బలంగా ఉందని, శస్త్ర చికిత్సల అనంతరం ఆయన కోలుకుంటున్నారని తెలిపింది.

కానీ ఇంతలోనే ఆయన మరణవార్త బయటకు రావడంతో రెజ్లింగ్ అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. ప్రొషెషనల్ రెజ్లర్ గా హల్క్ ఓ జనరేషన్ మొత్తానికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. 1953 ఆగస్టు 11న జార్జియాలోని ఆగస్టాలో టెర్రీ యూజీన్ బోలియాగా జన్మించిన ఆయన రెజ్లింగ్‌లో అడుగుపెట్టాక హల్క్ అని పేరుమార్చుకున్నారు. రెజ్లింగ్‌లో తన తరవాత తరాలతోనూ ఆయన ఫైటింగ్ చేసి చాంపియన్ షిప్ ట్రోఫీలను సొంతం చేసుకున్నారు. రెజ్లింగ్ లెజెండ్ గా పేరు సంపాదించుకున్నారు.

Next Story