- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OUR NUDES NOT YOUR BUSINESS : మా నగ్న చిత్రాలు మీ వ్యాపారం కాదు.. గూగుల్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మహిళ
జర్మనీకి చెందిన లారా అనే మహిళ క్యాజువల్‌గా తన పేరును గూగుల్‌లో సెర్చ్ చేసింది. నెక్స్ట్ సెకన్ ఆమెకు భూమి కంపించినంత పని అయిపోయింది. ఆమెకు సంబంధించిన న్యూడ్ పిక్స్, సెక్స్ వీడియోలు, గుర్తింపు కార్డులు అన్నీ ఉన్నాయి. పోర్న్ సైట్‌లలో అప్‌లోడ్ చేయబడ్డాయి.

దిశ, వెబ్ డెస్క్ : జర్మనీకి చెందిన లారా అనే మహిళ క్యాజువల్‌గా తన పేరును గూగుల్‌లో సెర్చ్ చేసింది. నెక్స్ట్ సెకన్ ఆమెకు భూమి కంపించినంత పని అయిపోయింది. ఆమెకు సంబంధించిన న్యూడ్ పిక్స్, సెక్స్ వీడియోలు, గుర్తింపు కార్డులు అన్నీ ఉన్నాయి. పోర్న్ సైట్‌లలో అప్‌లోడ్ చేయబడ్డాయి. దీంతో ఆమె కుటుంబాన్ని, సహోద్యోగులను ఫేస్ చేయలేక.. మరో చోటుకు వెళ్లిపోయింది. ఎవరికి ఎలా ఆన్సర్ చెప్పాలో తెలియక డిప్రెషన్‌ను అనుభవించింది. తన గూగుల్ క్లౌడ్ స్టోరేజీ నుంచి హ్యాక్ చేయబడిన ఫొటోలు ఈ విధంగా పబ్లిక్‌గా దర్శనమివ్వడంతో.. గూగుల్‌పై దావా వేసింది. ‘ మా నగ్న చిత్రాలు మీ వ్యాపారం కాదు(OUR NUDES NOT YOUR BUSINESS)’ పేరుతో ఈ కేసు ప్రస్తుత విచారణ గూగుల్ యూరోపియన్ ప్రధాన కార్యాలయం ఉన్న ఐర్లాండ్‌లో జరుగుతుంది.
కేసు విచారణ ప్రారంభమయ్యాక ఫొటోలు, వీడియోలు డిలీట్ చేసినా.. ఏఐ ద్వారా జనరేట్ చేయబడిన డీప్ ఫేక్స్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో చూపిస్తూనే ఉన్నాయి. దీంతో లారా తనకు సంబంధించిన పూర్తి వీడియోలు, ఫొటోలు, డీప్ ఫేక్‌ను గూగుల్ సెర్చ్ ఇండెక్స్ నుంచి శాశ్వతంగా రిమూవ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ మెటీరియల్ గూగుల్, పోర్న్ సైట్స్‌లో మళ్లీ అప్‌లోడ్ చేసినా కనిపించకుండా చేయాల్సిన బాధ్యత గూగుల్‌దేనని వాదిస్తోంది. హీట్ ఎయిడ్ ఈ కేసు లీగల్ ఫీజులను భరిస్తుండగా.. సంచలన తీర్పును ఆశిస్తున్నట్లు తెలిపారు సీఈఓ జోసెఫిన్ బాలన్.






