లంచం ఇచ్చిన వాళ్లకే ఇండ్లు ఇస్తారా? అధికారులపై కర్ణాటక ఎమ్మెల్యే ఫైర్

by Shamantha N |   (  Updated:2025-06-20 07:15:34  IST  )

కర్ణాటక లో రాష్ట్ర రాజీవ్ గాంధీ హౌసింగ్ స్కీం కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది.

లంచం ఇచ్చిన వాళ్లకే ఇండ్లు ఇస్తారా? అధికారులపై కర్ణాటక ఎమ్మెల్యే ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక లో రాష్ట్ర రాజీవ్ గాంధీ హౌసింగ్ స్కీం కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పాలసీ అండ్ ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్, అలాడ్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ఆడియో క్లిప్ ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్నిషేక్ చేస్తోంది. హౌసింగ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ వ్యక్తిగత సహాయకుడు సర్ఫరాజ్ ఖాన్ తో ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ మాట్లాడిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. రాష్ట్ర రాజీవ్ గాంధీ హౌసింగ్ కార్పొరేషన్‌కి చెందిన అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఇళ్ల కేటాయింపుల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగింది. లంచం ఇచ్చిన వారికే ఇళ్లను కేటాయిస్తున్నారు. ప్రజాప్రతినిధులమైన మేం చేసిన సిఫార్సులను పట్టించుకోవడం లేదు. డబ్బు తీసుకుని లబ్ధిదారులుగా మార్చుతున్నారు. ఇదేమైనా వ్యాపారమా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ అధ్యక్షుడు డబ్బులు ఇచ్చి ఇళ్లను పొందారు. నేను ఎమ్మెల్యేగా చేసిన సిఫార్సులు తృణప్రాయంగా వదిలేశారు. ఇలా జరిగితే నాకు ప్రజల్లో గౌరవం మిగులుతుందా అని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై హౌసింగ్ మంత్రి వ్యక్తిగత సహాయకుడు ఖాన్ స్పందిస్తూ ఎవరు లంచం తీసుకున్నారో చెబితే వారిపై చర్యలు తీసుకుంటామని, వారిని జైలుకు పంపిస్తామని ఎమ్మెల్యేకు సమాధానం చెప్పాడు.

లబ్ధిదారుల జాబితా బయటకు వస్తే అంతే సంగతులు

లబ్ధిదారుల జాబితా బయటకు వస్తే కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తాయంటూ ఆవేశంగా మాట్లాడారు. ఆయన ఆడియోలో మాట్లాడిన ప్రకారం.. అలాండ్ నియోజకవర్గంలోని మొత్తం 950 ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని, అందులో మున్నల్లిలో 200, హిట్టల శిరూర్ లో 100, దంగాపూర్‌లో 200, కావలగ, మడియాల్లో 200 ఇళ్ల కేటాయింపుల్లో లంచాలు తీసుకున్నట్టు ఆరోపించారు ఈ లీకైన ఆడియోతో హౌసింగ్ కార్పొరేషన్‌లో ఇళ్ల కేటాయింపులపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా కాంగ్రెస్ సర్కారు దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. హౌసింగ్ డిపార్ట్ మెంట్ వ్యవస్థ పై కర్ణాటక సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని అందరూ చర్చించుకుంటున్నారు.

Next Story