మోజ్తాబాను వెతికి పట్టుకుని చంపేస్తాం: ఇజ్రాయెల్

by velandi.Saikiran |   (  Updated:2026-03-18 09:30:47  IST  )

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖ‌మేనీని వెతికి పట్టుకొని చంపేస్తామని ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరికలు పంపింది.

మోజ్తాబాను వెతికి పట్టుకుని చంపేస్తాం: ఇజ్రాయెల్
X

దిశ, వెబ్ డెస్క్‌: ఇరాన్ కు మరో వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్. యుద్ధం భయంకరంగా జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖ‌మేనీని వెతికి పట్టుకొని చంపేస్తామని ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరికలు పంపింది. ఇజ్రాయెల్ కు ముప్పు కలిగించే ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవ‌డాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. తమ దేశానికి వ్యతిరేకంగా చేయి ఎత్తిన వారు మా నుంచి తప్పించుకోలేరని, అలాంటి వాళ్లను వెంబడిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్ మిలిటరీ. వెతికి పట్టుకొని వాళ్లను హతమార్చుతామని పేర్కొంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖ‌మేనీ ఏ మూలన దాక్కున్న బయటకు తీసుకువచ్చి చంపేస్తామని తెలిపింది. అయితే మోజ్తాబా ఖ‌మేనీ ఆచూకీ పై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది ఇజ్రాయెల్. కాగా, ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో గాయపడిన మోజ్తాబా ఖ‌మేనీ రష్యాలో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇరాన్ దాడులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్

Next Story