- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
US-Israel strikes: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భార్య మృతి.. కుటుంబంలో భారీ ప్రాణనష్టం!
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన మరుసటి రోజే ఆయన భార్య మన్సూరే ఖోజస్తే బాఘెర్జాదే (79) తుదిశ్వాస విడిచారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన మరుసటి రోజే ఆయన భార్య (Mansoureh Khojasteh) మన్సూరే ఖోజస్తే బాఘెర్జాదే (79) తుదిశ్వాస విడిచారు. ఇటీవల టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ కార్యాలయంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో ఆమె తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా వెల్లడించింది.
కుటుంబంలో భారీ ప్రాణనష్టం..
ఈ వైమానిక దాడి కేవలం సుప్రీం లీడర్‌ను మాత్రమే కాకుండా, ఆయన కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేసింది. తాజా నివేదికల ప్రకారం, ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, ఒక మనవడు, కోడలు, అల్లుడు కూడా అదే దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఖమేనీ దంపతులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో మొజ్తబా ఖమేనీ రాజకీయంగా అత్యంత కీలక వ్యక్తిగా గుర్తింపు పొందారు.
ఖమేనీకి వెన్నంటి నిలిచారు..
ఒక ప్రముఖ వ్యాపార కుటుంబంలో జన్మించిన మన్సూరే, 1964లో అలీ ఖమేనీని వివాహం చేసుకున్నారు. 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు, ఖమేనీ జైలు జీవితం గడిపిన సమయంలోనూ, ఆ తర్వాత ఆయన సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఇరాన్ శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన క్రమంలోనూ ఆమె ఆయనకు వెన్నంటి నిలిచినట్లు తెలుస్తోంది. అయితే, ఇతర రాజకీయ నేతల భార్యల మాదిరిగా ఆమె ఎప్పుడూ బహిరంగ వేదికలపై కనిపించలేదు. తన జీవితాన్ని అత్యంత గోప్యంగా, ప్రచారానికి దూరంగా గడిపారు. కాగా, ఖమేనీ మరణంతో పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతోంది. అమెరికా- ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగిస్తుండగా, ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగుతోంది. కువైట్‌లోని అమెరికా స్థావరాలపై జరిగిన దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు మరణించినట్లు పెంటగాన్ ధ్రువీకరించింది.
Similar News :






