వైట్‌హౌస్ చూసేద్దాం రండి! ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాటలకు నెటిజన్లు ఫిదా

by Ramesh Naini |

అగ్రరాజ్యం అమెరికాలోని వైట్‌హౌస్ గురించి అందరూ వినే ఉంటారు. వాషింగ్టన్ డీసీ లోని పెన్సిల్వేనియా అవెన్యూ వద్ద ఉంటుంది.

వైట్‌హౌస్ చూసేద్దాం రండి! ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాటలకు నెటిజన్లు ఫిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: అగ్రరాజ్యం అమెరికాలోని వైట్‌హౌస్ గురించి అందరూ వినే ఉంటారు. వాషింగ్టన్ డీసీ లోని పెన్సిల్వేనియా అవెన్యూ వద్ద ఉంటుంది. ఇది అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం అనే విషయం తెలిసిందే. చారిత్రక కట్టడం, టెక్నాలజీ, ఇలా ఎన్నో ప్రత్యేకతలు, రహస్యలు ఈ వైట్‌ హౌజ్‌లో దాగి ఉన్నాయి. వైట్ హౌస్ నిర్మాణం 1792లో ప్రారంభం కాగా 1800 లో పూర్తి చేశారు. దీనిని ఐరిష్ ఆర్కిటెక్ట్ జేమ్స్ హోబన్ రూపొందించి.. నియో క్లాసికల్ శైలిలో నిర్మించారు. 1814లో బ్రిటిష్ సైన్యం వాషింగ్టన్‌పై దాడి చేసి వైట్‌హౌస్‌ను తగలబెట్టారు. అనంతరం వైట్ హౌజ్‌ను పునర్నిర్మించారు.

ఇక వైట్‌‌హౌజ్‌లో ఉన్న సౌకర్యాల విషయానికొస్తే.. 132 గదులు , 35 స్నానపు గదులతో పాటు మొత్తం 6 అంతస్తులు ఉన్నాయి. ఇందులో స్టేట్ డైనింగ్ రూమ్ , ఓవల్ ఆఫీస్ , మ్యాప్ రూమ్‌ వంటి ఎన్నో ప్రత్యేక గదులు ఉన్నాయి. అలాగే పెద్ద జిమ్ , స్విమ్మింగ్ పూల్, సినిమా థియేటర్, టెన్నిస్ కోర్టులు లాంటివి మరికొన్ని ఉన్నాయి. విందు కోసం 140 మంది అతిథులను 1,000 మందికి పైగా వసతి కల్పించగలదు. ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన భవనాల్లో వైట్‌ హౌజ్‌ టాప్‌లో ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అత్యాధునిక భద్రతా పరికరాలు, వేలాది సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఒక బంకర్ సైతం ఉంటుంది. ఈ బంకర్‌లో ప్రెసిడెంట్, ముఖ్య అధికారులను అత్యవసర పరిస్థితుల నుంచి తప్పించుకునేలా నిర్మించారు. ప్రతి ఏడాది మిలియన్ల మంది ప్రజలు వైట్ హౌస్‌ను సందర్శిస్తుంటారు. ప్రస్తుత వైట్ హౌస్ కాంప్లెక్స్‌లో ఎగ్జిక్యూటివ్ రెసిడెన్స్, వెస్ట్ వింగ్, ఈస్ట్ వింగ్, ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్ ఉన్నాయి. ఇక్కడి నుంచి అధికారులు సేవలు అందిస్తుంటారు.

తాజాగా వైట్‌హౌస్ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వీడియో సమాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వైట్‌హౌస్‌లో ప్రెసిడెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వాహణ, జరిగే ప్రదేశాలు తిప్పి చూపించారు. వైట్‌హౌస్ అనేది చాలా అందమైన ప్రదేశమని, ఈ సారి ట్రంప్ రావడంతో ఇంకా అందంగా ఉందన్నారు. తన జాబ్ ప్రెసిడెంట్ చెప్పే వ్యాఖ్యలు, ఫీలింగ్స్, ఎజెండా ప్రజలకు చెప్పడమని తెలిపారు. జేమ్స్ బ్రాడీ బ్రీఫింగ్ రూమ్‌లో ప్రెస్ మీట్లు జరుగుతాయని, అన్ని దేశాల జర్నలిస్టులు ఈ ప్రెస్‌మీట్లకు వస్తారని చెప్పుకొచ్చారు. ఈ ప్రెస్ కాన్ఫిరెన్స్ రూమ్‌కు తను మొదట వచ్చే ముందు తన టీమ్‌తో న్యూస్ ప్రిపరేషన్, వార్తలు చదవడం, వాటిని అర్ధం చేసుకోని రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ప్రెసిడెంట్‌తో మాట్లాడటం చేస్తానని, వాటిని ప్రజలకు తెలియజేస్తానని ఆమె చెప్పారు. సౌత్ కోర్టు ఆడిటోరియంలో ఇంటర్వ్యూలు, మీటింగ్స్ జరుగుతాయన్నారు. ఇక ప్రెసిడెంట్‌కు రెడ్ కలర్ టెస్లా కారు ఉంటుందని, ఆ కారు ఇక్కడ పనిచేసే స్టాఫ్ పరిష్మన్ తీసుకొని నడపవచ్చని వివరించారు. తను కూడా ఆ టెస్లా కారు నడపాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె మాటలకు నెటిజన్‌లు ఫిదా అయ్యారు.

ఇక, వైట్ హౌస్ సందర్శించాలనుకుంటే, మీరు ముందుగా వైట్ హౌస్ విజిటర్ టిక్కెట్ పొందాలి. టికెట్ పొందాలంటే రిజర్వేషన్ చేసుకోవాలి. వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. వైట్ హౌస్ పర్యటనకు దాదాపు మూడు నెలల ముందే ప్లాన్ చేసుకోవాలని భవన వర్గాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాలకు మాత్రమే విజిటర్స్ అలోవ్ చేస్తారు. టికెట్స్ దొరకడం సులభమైన విషయం కాదు.. దీంతో భవనాన్ని బయట నుంచి చూసేవాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉంటారు.

Next Story