- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా - ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం : ఇరాన్ హెచ్చరిక
తమ సుప్రీం లీడర్ ను హతమార్చిన ఇజ్రాయెల్, అమెరికా దేశాలపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోపంతో రగిలిపోతోంది. అమెరికా - ఇజ్రాయెల్ దాడుల్లో గొప్ప విప్లవ నేతను కోల్పోయామని విచారం వ్యక్తం చేసింది. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో వీరమరణం పొందారని పేర్కొంది. ఆయన మరణం పట్ల ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సంతాపం ప్రకటించింది. రివల్యూషనరీ గార్డ్స్ కు అపరిమిత అధికారాలు ఇచ్చిన నేతను కోల్పోవడంతో.. ప్రతీకారం తీర్చుకునేందుకు వేచి చూస్తోంది.
త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. రివేంజ్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇంత పెద్దనేరం చేసిన దేశాలకు జవాబు చెప్పకుండా ఉండలేమని పేర్కొంది. అమెరికా స్థావరాలపై వినాశకర దాడులు చేస్తామని వెల్లడించింది. ఖమేనీ బంకర్లలో దాక్కున్నారని శత్రువులు తప్పుడు ప్రచారం చేశారని తెలిపింది. త్వరలోనే ఖమేనీ వారసుడిని ప్రకటిస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది.






