చారిత్రాత్మక విజయం.. ఇరానియన్లకు ఇది గొప్ప అవకాశం : డొనాల్డ్ ట్రంప్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-01 10:24:31  IST  )

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు.

చారిత్రాత్మక విజయం.. ఇరానియన్లకు ఇది గొప్ప అవకాశం : డొనాల్డ్ ట్రంప్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ మీడియా కంటే ముందే ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తమ దాడుల్లో మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ మరణాన్ని ఒక చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. ఆయన మృతితో ఇరానియన్లకు గొప్ప అవకాశం లభించిందని, తిరిగి తమ దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇది మంచి ఛాన్స్ అని ట్రూత్ సోషల్ లో చేసిన పోస్టుల్లో పేర్కొన్నారు. ఖమేనీ మృతి ఇరాన్ ప్రజలతో పాటు అమెరికన్లకు కూడా గొప్ప విజయమన్నారు. ఖమేనీ బాధితులకు తాము న్యాయం చేశామన్నారు. అమెరికా నిఘా, అధునాతన ట్రాకింగ్ వ్యవస్థల నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారన్నారు. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ లోని ఇతర నాయకులు చేయగలిగేది ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, సైన్యం, పోలీసులు తమతో పోరాడాలని అనుకోవట్లేదని, నిజానికి ఇరాన్ సైన్యం తమ నుంచి మద్దతు కోరుకుంటోందని ట్రంప్ కామెంట్ చేశారు. ఇరాన్ ప్రజాస్వామ్యవాదులతో అక్కడి సైన్యం, రివల్యూషనరీ గార్డ్స్ కలిసి ఇరాన్ ను గొప్పగా పునర్నిర్మించుకోవాలని సూచించారు. అయితే.. ఖమేనీ మరణంతో దాడులు ఆగవని, మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పే లక్ష్యం నెరవేరే వరకు ఈ పిన్ పాయింట్ బాంబు దాడులు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు.

అమెరికా - ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం : ఇరాన్ హెచ్చరిక

Next Story