జెన్-Z నిరసనల్లో మరణించిన వారిని అమరులుగా ప్రకటిస్తాం : నేపాల్ కొత్త ప్రధాని సుశీలా కర్కి

by Naga Rani Yarlagadda |

నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్, గత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడంతో జెన్-Z (Gen-Z) చేసిన తీవ్ర నిరసనలు కేపి శర్మ ఓలి (KP Sharma Oli) ప్రభుత్వాన్ని కూల్చివేశాయి.

జెన్-Z నిరసనల్లో మరణించిన వారిని అమరులుగా ప్రకటిస్తాం : నేపాల్ కొత్త ప్రధాని సుశీలా కర్కి
X

దిశ, వెబ్‌డెస్క్: నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్, గత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడంతో జెన్-Z (Gen-Z) చేసిన తీవ్ర నిరసనలు కేపి శర్మ ఓలి (KP Sharma Oli) ప్రభుత్వాన్ని కూల్చివేశాయి. ఇటీవల ఆ దేశ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి 9 (Suseela Karki) బాధ్యతలు చేపట్టారు. నేపాల్ సుప్రీంకోర్టు (Nepal Supreme Court) మాజీ జడ్జి అయిన ఆమె.. తన తొలి ప్రసంగంలోనే జెన్-Z లపై కీలక ప్రకటన చేశారు. వారి నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా అమరులుగా ప్రకటిస్తామని తెలిపారు. దేశాన్ని పునర్నిర్మించడానికి అందరం కలిసి సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం అధికార జులుం ప్రదర్శించేందుకు కాకుండా.. ప్రజలకు సేవ చేసేందుకు పనిచేస్తుందని తెలిపారు.

తాను ఆరునెలల కంటే ఎక్కువకాలం అధికారంలో ఉండనని, కొత్తగా ఎన్నికైన పార్లమెంటుకు అధికారాన్ని అప్పగిస్తానని తెలిపారు. ప్రజల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని నడిపించలేమని, ప్రజల మద్దతు ఉంటే రాబోయే ఎన్నికలు సజావుగా సాగుతాయని తెలిపారు. కాగా.. 2026 మార్చి 5న నేపాల్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నట్లు అధ్యక్షుడు రామచంద్ర ప్రకటించారు. గత పార్లమెంట్ ను ఆయన రద్దు చేసిన అనంతరం తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం నేపాల్ లో పరిస్థితులు అదుపులోకి రాగా.. కర్ఫ్యూ, నిషేధాజ్ఞలను ఆర్మీ ఎత్తివేసింది.

Next Story