Russia vs Ukraine: రష్యాలో 4 వేల కిలోమీటర్లు చొచ్చుకెళ్లి మరీ దాడి చేశాం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు

by Shamantha N |   (  Updated:2025-06-02 06:08:06  IST  )

రష్యా భూభాగంలోకి చేసిన డ్రోన్ దాడి అత్యంత అద్భుతమైనదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ దళాలు గొప్ప ఆపరేషన్ నిర్వహించాయని ప్రశంసించారు. దాదాపు రష్యాకు చెందిన 41 విమానాలను ధ్వంసం చేసిన ఈ దాడిని స్పైడర్ వెబ్ గా నామకరణం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Russia vs Ukraine: రష్యాలో 4 వేల కిలోమీటర్లు చొచ్చుకెళ్లి మరీ దాడి చేశాం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా భూభాగంలోకి వెళ్లి చేసిన డ్రోన్ దాడి అత్యంత అద్భుతమైనదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ దళాలు గొప్ప ఆపరేషన్ నిర్వహించాయని ప్రశంసించారు. దాదాపు రష్యాకు చెందిన 41 విమానాలను ధ్వంసం చేసిన ఈ దాడిని స్పైడర్ వెబ్ గా నామకరణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ డ్రోన్ల దాడి తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వరుసగా ఎక్స్ లో పోస్టులు చేస్తూనే ఉన్నాడు. మా స్పెషల్‌ ఫోర్స్‌ అధిపతి వాసిల్‌ మలియుక్‌ అద్భుతమైన ఆపరేషన్‌ గురించి చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. రష్యాలోని భూభాగంలో మాపై దాడులు చేస్తున్న ఆయుధాలను ఎంపిక చేసుకుని ధ్వంసం చేయడం ఎంతో అద్భుతమన్నారు. ఉక్రెయిన్‌కు చెందిన సెక్యూరిటీ సర్వీసెస్‌ సిబ్బందికి ఆయన థాంక్స్ చెప్పారు.

ఓ వైపు శాంతి చర్చలు జరుపుతూనే దాడులు..

తుర్కియే క్యాపిటల్ సిటీ ఇస్తాంబుల్ లో రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరుగుతుండగా ఈ దాడులకు పాల్పడ్డారు. దాదాపు 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు పేర్కొన్నారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం.. ఉక్రెయిన్ తన డ్రోన్లను కంటెయినర్లలో రష్యాలోకి తరలించింది. అనంతరం 41 రష్యా యుద్ధ విమానాలను ధ్వంసం చేయగలిగింది. ఇర్క్యూట్, తదితర ప్రాంతాల్లో ఉక్రెయిన్ దాడులకు తెగబడినట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు. మూడు సంవత్సరాలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యే శాంతి చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చినప్పటికీ ఉక్రెయిన్ డ్రోన్ల దాడి చేయడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.

Next Story