- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరాన్ ఇప్పట్లో అణ్వస్త్రాలు తయారీ చేయలేనంత దాడులు చేశాం: ఇజ్రాయిల్
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ ఐదవ రోజుకు చేరింది. రెండు దేశాలు దాడులను విస్తృతం చేశాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 224 మంది ఇరానీయులు మృతి చెందారు

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ ఐదవ రోజుకు చేరింది. రెండు దేశాలు దాడులను విస్తృతం చేశాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 224 మంది ఇరానీయులు మృతి చెందారు. వీరిలో టెహ్రాన్‌కు చెందిన అగ్రశ్రేణి సైనిక కమాండర్లు, అణు శాస్త్రవేత్తలు, సాధారణ పౌరులు ఉన్నారు. మరోవైపు ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్ భూభాగంలో మహిళలు, పిల్లలు సహా కనీసం 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం ఇరాన్ నుంచి కొత్త క్షిపణులు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీ7 సమ్మిట్ నుంచి మధ్యలోనే విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇరాన్ రాజధాని టెహ్రన్ లో ఉంటున్న వారు ఖాళీ చేయాలని హెచ్చరించారు. కెనడాలో జీ7 సమ్మిట్ జరుగుతోంది. ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ఇజ్రాయిల్ కు మద్దతు తెలిపారు.
ఇరాన్ టెలివిజన్ పై దాడి ఎందుకు చేశామంటే..
గత శుక్రవారం నుంచి ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఇరాన్ అణు, సైనిక వ్యవస్థలపై దాడులు ప్రారంభించిన తర్వాత మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇరాన్ అణు కార్యక్రమంపై టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య చర్చలు జరుగుతుండగానే ఈ దాడులు జరగడం గమనార్హం.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. ‘ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ అణు ప్రోగ్రామ్‌ను చాలా వెనక్కి నెట్టాయని’ తెలిపారు. వారు చేస్తున్న ప్రయోగాలు చాలా వెనక్కి వెళ్లిపోయాయని ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి వద్ద ఇజ్రాయెల్ రాయబారి డ్యానీ డానన్ ను రిపోర్టర్లు ఇరాన్ స్టేట్ టెలివిజన్ ఎందుకు లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని ప్రశ్నించారు. భయానక పాలక వ్యవస్థకు సహకరిస్తున్న ఎవరిపైనైనా తాము దాడులు చేస్తామని ఇజ్రాయిల్ రాయబారి హెచ్చరించారు.
ఉగ్రవాదాన్ని ఆపితేనే శాంతిచర్చలు
UN అణు చీఫ్ రఫాయెల్ గ్రోస్సీ ఇరాన్‌లోని నటాంజ్ అణు కేంద్రం ఇజ్రాయెల్ దాడుల వల్ల ప్రభావితం కాలేదన్నారు. దీనిపై ఇజ్రాయిల్ రాయబారి డానన్ స్పందిస్తూ తాము చేసిన దాడుల్లో ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ తయారీలో చాలా కాలం వెనకబడినట్లే అని చెప్పారు. గతంలో అమెరికా ఇరాక్, సిరియాపై చేసిన దాడుల కంటే భీకరమైనవి అని వెల్లడించారు. ఇరాన్ ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించే వరకు ఎలాంటి చర్చలు ఉండవని డానన్ తేల్చి చెప్పారు.






