కర్ణాటకలో ప్రారంభించిన 15 రోజులకే ఫ్లైఓవర్ నుంచి నీరు లీక్

by Shamantha N |

కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని కల్లడ్క ప్లై ఓవర్ ఎనిమిది సంవత్సరాల నిర్మాణం పూర్తి చేసుకుని ఈ జూన్ 2న అట్టహాసంగా ప్రారంభించారు.

కర్ణాటకలో ప్రారంభించిన 15 రోజులకే ఫ్లైఓవర్ నుంచి నీరు లీక్
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని కల్లడ్క ప్లై ఓవర్ ఎనిమిది సంవత్సరాల నిర్మాణం పూర్తి చేసుకుని ఈ జూన్ 2న అట్టహాసంగా ప్రారంభించారు. కాగా ప్రారంభించిన 15 రోజులకే కురిసిన భారీ వర్షం కారణంగా ఫ్లై ఓవర్ నుంచి భారీగా నీరు లీకేజీ అవుతోంది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఓ ఆట ఆడుకుంటున్నారు. భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) నిర్మించిన కల్లడ్క ఫ్లైఓవర్ లో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జూన్ లో కురిసిన చిన్న పాటి వర్షాలకే ఫ్లై ఓవర్ లో ఒక పెద్ద లోపం బయటపడింది. ఫ్లైఓవర్ నిర్మాణం నుండి నీరు కిందకు కారింది. దీంతో దాని కింద కార్లను పెడుతున్నారు. ఉచితంగా కార్ వాష్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కారు వాష్ తో నెట్టింట ట్రోల్

ఫ్లైఓవర్ కింద పార్క్ చేసిన కారుపై వర్షపు నీరు నేరుగా కురుస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అయ్యింది. ఇది ఆన్‌లైన్ లో ఫుల్ మీమ్స్ క్రియేట్ చేస్తూ జాతీయ రహదారుల అథారిటీ నిర్మాణ లోపాల్ని ఎత్తి చూపుతున్నారు. ఫ్లైఓవర్ నుంచి నీరు కారుతూ కింద రోడ్డుపైకి పడుతోంది, అనుకోకుండా ప్రయాణిస్తున్న వాహనాలకు ఉచిత కార్ వాష్ సదుపాయాన్ని అందిస్తుంది. ఇది కొందరిని అలరించినప్పటికీ, నిర్మాణంలో నాణ్యత సరిగా లేకపోవడం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో అవినీతికి ఇది తీవ్రమైన పరిణామని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. విపరీతమైన ట్రోలింగ్ తో అధికారులు తక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఫ్లై ఓవర్ ప్రాంతంలో (NHAI) ప్యాచ్‌వర్క్ రిపేర్లు ప్రారంభించింది.

Next Story