థాయ్‌లాండ్‌- కంబోడియా యుద్ధం..సరిహద్దుల్లో కాల్పుల మోత?

by Ajay Maddhiboyina |

ప్ర‌పంచంలోని మ‌రో రెండు దేశాల మ‌ధ్య యుద్ధ‌వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. థాయ్ లాండ్ కంబోడియా దేశాల స‌రిహ‌ద్దుల్లో ఇరు దేశాల సైనికులు కాల్పులు జ‌రుపుతున్నారు.

థాయ్‌లాండ్‌- కంబోడియా యుద్ధం..సరిహద్దుల్లో కాల్పుల మోత?
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌పంచంలోని మ‌రో రెండు దేశాల మ‌ధ్య యుద్ధ‌వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. థాయ్ లాండ్ కంబోడియా దేశాల స‌రిహ‌ద్దుల్లో ఇరు దేశాల సైనికులు కాల్పులు జ‌రుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో రెండు దేశాల్లో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ప్రాచీన ఆల‌యం అయిన ప్రసాత్ త‌ముఎన్‌తోమ్ వద్ద కాల్పుల కారణంగా అలజడి రేగింది. థాయ్ లాండ్ కంబోడియా దేశాలు బార్డర్‌లో కాల్పులతో ఆగకుండా యుద్ధ విమానాలు, ల్యాండ్ మైన్స్, పేలుడు పదార్థాలతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.

ఇప్పటి వరకు ఈ దాడుల్లో 9 మంది వరకు మృతి చెందిన‌ట్టు స‌మాచారం. థాయ్‌లాండ్ కంబోడియాతో ఉన్న అన్ని సరిహద్దులను మూసివేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధానికి సరిహద్దు వివాదాలు కారణం కాగా మే నెలలో ఒక కంబోడియా సైనికుడు మరణించిన నాటి నుండి ఉధ్రిక్తతలు పెరిగిపోయాయి. యుద్దంపై స్పందించిన థాయ్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి సురసంత్ కొంగ్సిరి కనీసం ఆరు సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు కొనసాగుతున్నటుటు ధృవీక‌రించారు.

Next Story