- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Waqf Bill : వక్ఫ్ సవరణ బిల్లు.. సుప్రీంకోర్టులో ఆప్ ఎమ్మెల్యే పిటిషన్
వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదించిన అనంతరం ఈ బిల్లు చట్టంగా మారుతుంది.

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ (Parliament) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదించిన అనంతరం ఈ బిల్లు చట్టంగా మారుతుంది. అయితే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంకోర్టు (Supreme court)ను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్ (Amanathullah khan) సైతం అత్యున్నత న్యాయస్థానంలో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల మతపరమైన, సాంస్కృతిక స్వయంప్రతిపత్తిని తగ్గిస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేగాక ప్రభుత్వ జోక్యం వల్ల మైనారిటీలు తమ మతపరమైన, స్వచ్ఛంద సంస్థలను నిర్వహించే హక్కులను బలహీనపరుస్తుందని ఆరోపించారు. ఏకపక్ష కార్యనిర్వహక జోక్యానికి వీలు కల్పిస్తుందని తెలిపారు.
దీంతో వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మూడో ప్రతిపక్ష పార్టీగా ఆప్ అవతరించింది. అంతకుముందు కాంగ్రెస్ (Congress), ఎంఐఎం సైతం పిటిషన్లు దాఖలు చేశాయి. కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్ (Mohammad javed), ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin owaisi) ఈ పిటిషన్లు వేశారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, చట్టవిరుద్ధమని తెలిపారు. దాని నిబంధనలు రాజ్యాంగంలోని వివిధ ఆర్టికల్స్‌ను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు వక్ఫ్ బిల్లును నిరసిస్తూ పలు రాష్ట్రాల్లో ముస్లింలు నిరసన తెలుపుతున్నారు.






