- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Volcano Erupts : ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం.. 18కిమీలు గాలిలోకి ఎగిరిపడ్డ బూడిద మేఘం
ఇండోనేషియా(Indonesia)లోని ఫ్లోర్స్ దీవిలోని మౌంట్ లెవోటోబీ లకి-లకి(Mount Levotoby Laki-Laki) అగ్నిపర్వతం(Volcano Erupts) నేడు బద్దలైంది.

దిశ, వెబ్ డెస్క్ : ఇండోనేషియా(Indonesia)లోని ఫ్లోర్స్ దీవిలోని మౌంట్ లెవోటోబీ లకి-లకి(Mount Levotoby Laki-Laki) అగ్నిపర్వతం(Volcano Erupts) నేడు బద్దలైంది. సోమవారం ఉదయం 11:05 గంటలకు (స్థానిక కాలమానం) ఈ అగ్ని పర్వతం బద్దలవగా.. 18 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద, ధూళి, విషవాయువులతో కూడిన దట్టమైన మేఘాలు గాలిలోకి ఎగసిపడ్డాయి. ఈ ధూళి, బూడిద మేఘం 90-150 కిమీ దూరం నుండి కూడా కనిపిస్తుండగా.. సమీపంలోని అనేక గ్రామాలపై బూడిద, రాళ్లు, శిథిలాలు పడ్డాయి. చుట్టుపక్కల పదుల కిలోమీటర్ల మేర బూడిద పొర కమ్మేసింది.
ఈ విస్ఫోటనంతో 4వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేసి, 10 కిమీల మేర ప్రాంతాన్ని నిషేధితంగా ప్రకటించారు. అయితే ముందస్తు సమాచారంతో గత 10 రోజుల క్రితమే 20 వేల మంది స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాలి, లాబువాన్ బాజో, మౌమెరె విమానాశ్రయాలు మూసివేశారు. కాగా ఈ ఘటనపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్థానిక అధికారులతో సమీక్షలు జరుపుతోంది.






