తమిళనాడుకు చెందిన వ్యక్తి డీఎన్ఏలో 70 వేల ఏళ్లనాటి జీన్స్

by Shamantha N |   (  Updated:2025-06-19 20:17:56  IST  )

తమిళనాడుకు చెందిన వ్యక్తి డీఎన్ఏలో(DNA) దాదాపు 70 వేల ఏళ్ల నాటి జీన్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు

తమిళనాడుకు చెందిన వ్యక్తి డీఎన్ఏలో 70 వేల ఏళ్లనాటి జీన్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడుకు చెందిన వ్యక్తి డీఎన్ఏలో(DNA) దాదాపు 70 వేల ఏళ్ల నాటి జీన్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. విరుమాండి తేవర్ అనే వ్యక్తి డీఎన్ఏలో ఎం130 (M130) అనే జన్యువు ఉందని వెల్లడించారు. ఈ జన్యువు ఆఫ్రికా నుండి భారతదేశానికి జరిగిన మొదటి వలసలకు సంబంధించినది అని చెబుతున్నారు. ఆఫ్రికా నుంచి వలస వచ్చిన వారిని జన్యు అధ్యయనాల్లో ప్రాచీన పూర్వీకుల దక్షిణ భారతీయులు (AASI) అని పిలుస్తారు. జన్యు శాస్త్రవేత్త డేవిడ్ రీచ్ నేతృత్వంలో 2019లో జరిగిన ఒక సంచలనాత్మక అధ్యయనం తర్వాత ఈ విషయం బయటపడింది.

13 మందిలో జీన్స్..

ఈ అధ్యయనం భారత వంశపారంపర్యతపైన అవగాహనను కల్పించింది. ఇకపోతే, ప్రొఫెసర్ రామసామి పిచ్చప్పన్ విరుమాండి అనే వ్యక్తిని పరీక్షించారు. ఇది తేని సమీపంలోని గ్రామవాసి విరుమాండిలో ఆ జన్యువులను గుర్తించారు. అంతేకాకుండా, మరో 13 మందిలో సీ-ఎం130 (C-M130) జీన్స్ ఉన్నట్లు తేలింది. ఈ పరిశోధన ద్వారా భారతదేశంలోని దక్షిణ ప్రాంతం, మానవ జాతి మొదటి స్థావరాల్లో ఒకటిగా ఉందని కూడా తెలుస్తోంది. ఇది మానవ పరిణామ క్రమం, వలసల ముఖ్యమైన ఆధారంగా పరిగణిస్తున్నారు. కాగా.. ఇప్పుడు శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనం మానవ జన్యుశాస్త్రం, ప్రాచీన చరిత్రకు సంబంధించిన కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ జన్యు అధ్యయనం 1700 సంవత్సరాల క్రితం సామాజిక స్తరీకరణ జరిగిందని వెల్లడించింది.


Next Story