రోడ్డుపై మహిళ హల్చల్... అతడి కాలర్ పట్టి మరీ... (వీడియో)

by Disha Web |
రోడ్డుపై మహిళ హల్చల్... అతడి కాలర్ పట్టి మరీ... (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఉబెర్ డ్రైవర్ పై జాత్యహంకార దుర్భాషలాడుతూ హల్చల్ చేసిన మహిళ వీడియో తెగ వైరల్ అవుతోంది. జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే... సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అమెరికాలోని డీసీ కేథడ్రల్ హైట్స్ లోని ఒక కాలిబాటపై నల్లజాతి వ్యక్తిని, ఉబెర్ డ్రైవర్ గా భావించి అతడిపై ఓ మహిళ బిగ్గరగా అరుస్తూ వాగ్వాదానికి దిగుతున్న దృశ్యం ఆ వీడియోలో కనిపిస్తూ ఉంది. అంతేకాదు... అతడిపై జాత్యహంకార దుర్భాషలాడింది. చివరకు అతని కాలర్ పట్టినట్లుగా అందులో కనిపిస్తుంది. అయితే, ఇదంతా కూడా బిల్డింగ్ పై నుంచి ఓ మహిళ రికార్డు చేసిందని, వీధి పక్కన పార్క్ చేసిన కారుతో మరియు దాని తలుపు తెరిచి ఉండడంతో గొడవ పడుతున్నట్లు చూపిస్తుందని అందులో పేర్కొన్నారు.

Next Story

Most Viewed