ఫ్రాంక్ఫార్ట్, జర్మనీ‌లో వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం!

by Ajay Maddhiboyina |

ఫ్రాంక్ఫార్ట్ , జర్మనీలో తిరుమల వైభవాన్ని ప్రతిబింబిస్తూ, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరియు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) సహకారంతో, శ్రీ బాలాజీ వేదిక్ సెంటర్ జర్మని ఇ.వి (SBVC) ఆధ్వర్యంలో ఈ దివ్య మహోత్సవం జరిగింది.

ఫ్రాంక్ఫార్ట్, జర్మనీ‌లో వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం!
X

దిశ, వెబ్ డెస్క్: ఫ్రాంక్ఫార్ట్ , జర్మనీలో తిరుమల వైభవాన్ని ప్రతిబింబిస్తూ, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరియు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) సహకారంతో, శ్రీ బాలాజీ వేదిక్ సెంటర్ జర్మని ఇ.వి (SBVC) ఆధ్వర్యంలో ఈ దివ్య మహోత్సవం జరిగింది. టిటిడి డిప్యూటీ.ఇ.ఇ. మల్లయ్య పర్యవేక్షణలో టిటిడి వేధ పండితుల బృందం వేద ఆచారాలతో, శాస్త్రోక్తంగా శ్రీవారి కళ్యాణ కృతువును నిర్వహించింది.


ఈ కార్యక్రమానికి కన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, కన్సులేట్ జెనెరల్ శుచితా కిషోర్, (CGI Frankfurt), Königstein im Taunus మేయర్ హెల్మ్ ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై, శ్రీవారి దివ్య ఆశీస్సులు పొందారు. విదేశీ నేలపై భారతీయ సంస్కృతికి లభించిన ఈ గౌరవం అందరినీ ఆనందభరితులను చేసింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు క్రిష్ణ జవ్వాజి మరియు సూర్య ప్రకాష్ వెలగా మాట్లాడుతూ.. ఫ్రాంక్ఫార్ట్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు ఈ కల్యాణోత్సవం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతి కలిగించగలగడం మా భాగ్యం. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన పండితులు, స్వచ్ఛంద సేవకులు, భక్తులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు,” అని పేర్కొన్నారు.



SBVC అధ్యక్షులు క్రిష్ణ జవ్వాజి మాట్లాడుతూ.. “ఫ్రాంక్ఫార్ట్ లో నివసిస్తున్న భక్తులకు తిరుమల వాతావరణాన్ని అందించడం మా అసోసియేషన్ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ విజయవంతమైన కార్యక్రమం శ్రీ బాలాజీ వేదిక్ సెంటర్ జర్మని ఇ.వి (SBVC) బృందం యొక్క అంకితభావం, సమిష్టి కృషి వల్ల జరిగిందన్నారు. కల్యాణోత్సవంలో జర్మనీ దేశంలో మ్యూనిచ్, హాంబర్గ్ ప్రతినిధులు టిట్టు మద్దిపట్ల, డా. శివ శంకర్ లింగం పాల్గొన్నారు. యూరప్ & యు.కె కళ్యాణం ప్రధాన కోఆర్డినేటర్ డాక్టర్ కిషోర్ బాబు చలసాని సారధ్యంలో డాక్టర్ శ్రీకాంత్, సుమంత్ కొర్రపాటి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం విజయవంతంగా సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

Next Story