- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా వీసా ప్రీమియం ఫీజు పెంపు.. స్టూడెంట్స్, టెక్కీలపైనే అధిక భారం
ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం అక్కడి వెళ్లాలని ప్లాన్ చేసుకునే భారతీయులపై మరో భారం పడనుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం అక్కడి వెళ్లాలని ప్లాన్ చేసుకునే భారతీయులపై మరో భారం పడనుంది. ఇమ్మిగ్రేషన్ ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను పెంచుతున్నట్లు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రకటించింది. హెచ్-1బీ, ఎల్-1, ఓపీటీ వీసాలపై వీటి ప్రభావం నేరుగా ఉంటుందని స్పష్టం చేసింది. పెంచిన ఫీజులు ఈ ఏడాది మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. 2023 జూన్ నుంచి 2025 జూన్ మధ్య కాలంలో నమోదైన ద్రవ్యోల్బణం దృష్ట్యా ఇమ్మిగ్రేషన్ ప్రీమియం ఫీజుల్ని సవరించినట్లు వెల్లడించింది. దీనిద్వారా వచ్చే ఆదాయాన్ని యూఎస్ సీఐఎస్ ఏజెన్సీ కార్యకలాపాలను మరింత మెరుగుపరిచేందుకు, వీసాల జారీని వేగవంతం చేసేందుకు, పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లను పరిష్కరించేందుకు వాడనున్నట్లు పేర్కొంది.
రూ.8 వేల నుంచి రూ.14 వేల వరకూ పెంపు
పెంచిన ఫీజుల ప్రకారం.. హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వంటి వర్క్ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 2,805 డాలర్లు (రూ.2.53 లక్షలు) నుంచి రూ.2,965 డాలర్లు (రూ.2.67 డాలర్లు)కు పెరగనుంది. ఎంప్లాయ్ మెంట్ ఆధారిత గ్రీన్ కార్డ్ పిటిషన్లకు కూడా ఇదే ఫీజు వర్తిస్తుంది. విద్యార్థులకు.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT), స్టెమ్-OPT దరఖాస్తుల ఫీజు 1,685 డాలర్లు (రూ.1.52 లక్షలు) నుంచి 1780 డాలర్లు (రూ.1.60 లక్షలు)కి పెంచింది. F-1, J-1 విద్యార్థుల స్టేటస్ మార్పు దరఖాస్తుల ఫీజును 1965 డాలర్లు (రూ.1.77 లక్షలు) నుంచి 2,075 డాలర్లు (రూ.1.87 లక్షలు)కు పెరిగింది.






