అమెరికా మరో కీలక నిర్ణయం.. 75 దేశాల పౌరులకు వీసా జారీ నిలిపివేత

by Ajay Maddhiboyina |

అగ్ర‌రాజ్యం అమెరికా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. 75 దేశాల పౌరుల‌కు జ‌న‌వ‌రి 21 నుండి వీసా ప్రాసెసింగ్ మొత్తాన్ని నిలిపివేస్తున్న‌ట్టు అమెరికా విదేశాంగ శాఖ ప్ర‌క‌టించింది.

అమెరికా మరో కీలక నిర్ణయం.. 75 దేశాల పౌరులకు వీసా జారీ నిలిపివేత
X

దిశ‌, వెబ్ డెస్క్: అగ్ర‌రాజ్యం అమెరికా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. 75 దేశాల పౌరుల‌కు జ‌న‌వ‌రి 21 నుండి వీసా ప్రాసెసింగ్ మొత్తాన్ని నిలిపివేస్తున్న‌ట్టు అమెరికా విదేశాంగ శాఖ ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుత చ‌ట్టం ప్ర‌కారం వీసాల‌ను తిర‌స్క‌రించాల‌ని కాన్సుల‌ర్ అధికారుల‌ను ఆదేశించింది. వీసా జారీ నిలిపివేసిన దేశాలలో ర‌ష్యా, బ్రెజిల్, థాయిలాండ్, యెమెన్, ఆఫ్ఘ‌నిస్తాన్ తో పాటు ఇరాన్ సైతం ఉన్నాయి.

అయితే ఇరాన్, ర‌ష్యా, సోమాలియా లాంటి దేశాల పౌరుల‌కు అమెరికా వీసా జారీ అయ్యే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. కానీ బ్రెజిల్ లాంటి దేశానికి సైతం వీసాలు జారీ చేయ‌డాన్ని నిలివేయడం ఇప్పుడు షాకింగ్ గా మారింది. వ‌ల‌స‌ల‌ను నియంత్రించ‌డం కోస‌మే ట్రంప్ స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే తాత్కాలికంగానే వీసాల జారీని నియంత్రింగా ఈ స‌మ‌యంలో డిపార్ట్ మెంట్ స్క్రీనింగ్, వెట్టింగ్ విధాల‌ను తిరిగి అంచ‌నా వేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.

Next Story