- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్విట్జర్లాండ్ చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం!
మధ్యప్రాచ్య వివాదాల పరిష్కారం కోసం స్విట్జర్లాండ్‌లో జరిగిన కీలక చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు చేదు అనుభవం ఎదురైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రాచ్య వివాదాల పరిష్కారం కోసం స్విట్జర్లాండ్‌లో జరిగిన కీలక చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ సమావేశంలో ఇరాన్, ఖతార్ ప్రతినిధులు ఆయనను కనీసం పట్టించుకోకుండా అవమానించినట్లు చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమెరికా, ఇరాన్, పాకిస్థాన్, ఖతార్ దేశాల మధ్య స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో ఆదివారం (Quadrilateral) చర్చలు జరిగిన విషయం తెలిసిందే.
వీడియోలో ఏముందంటే..?
నెట్టింట వైరల్ అవుతున్న దృశ్యాల ప్రకారం.. ఖతార్ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ థానీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ఆప్యాయంగా పలకరించారు. కానీ, పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను మాత్రం కనీసం పలకరించలేదు. మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా గదిలోకి వచ్చి షరీఫ్‌ను ఆలింగనం చేసుకున్నారు. ఆ గదిలో వెనుక వైపు నిలబడి ఉన్న వాన్స్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన వాకౌట్ చేశారు. కాగా, ఈ చర్చలకు సంబంధించి ఉమ్మడి ఫోటో సెషన్ (జాయింట్ ఫోటో) కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.
ట్రంప్ పంపిన రాయబారం..
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నడుమ ఇరాన్‌తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునే ఉద్దేశంతో ట్రంప్ యంత్రాంగం ఈ చర్చల్లో పాల్గొంది. ఒప్పంద షరతులకు ఇరాన్ కట్టుబడి ఉంటే, ఆ దేశంతో సత్సంబంధాల కోసం ‘కొత్త అధ్యాయాన్ని’ ప్రారంభించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నారని జేడీ వాన్స్ ఈ సమావేశంలో తెలిపారు.
కీలక పురోగతి సాధించామన్న ఇరాన్
ఈ చర్చల్లో ఖతార్, పాకిస్తాన్ కీలక మధ్యవర్తులుగా వ్యవహరించాయి. తొలివిడత చర్చలు ముగిసిన అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ‘పాకిస్తాన్, ఖతార్ మధ్యవర్తిత్వంతో లెబనాన్ యుద్ధాన్ని ముగించే దిశగా కీలక పురోగతి సాధించాం’ అని ఆయన పేర్కొన్నారు.
జేడీ వాన్స్‌ను విస్మరించిన ఇరాన్, ఖతార్ ప్రతినిధులు.. నెట్టింట వీడియోలు వైరల్






