- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు అలర్ట్..రేపటి నుంచే విత్తన మేళా
by velandi.Saikiran |
ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని రైతు వేదికలలో విత్తన మేళా జరుగనుంది.

X
దిశ, వంగూరు: ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని రైతు వేదికలలో విత్తన మేళా నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి ప్రియదర్శిని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను ఒకేచోట అందుబాటులో ఉంచే ఉద్దేశంతో ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విత్తన మేళాలో ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాల వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులు తమ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు. కావున మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వంగూరు, రంగాపూర్, పోల్కంపల్లి గ్రామాలలోని రైతులు సమీప రైతు వేదికలను సందర్శించి నాణ్యమైన విత్తనాలను పొందాలని సూచించారు.
Next Story






