- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంథ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. వర్చువల్ విచారణకు అల్లు అర్జున్ హాజరు
హైదరాబాద్ లోని సంథ్యా థియేటర్ వద్ద గతేడాది జరిగిన తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసు విచారణకు హీరో అల్లు అర్జున్ వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లోని సంథ్యా థియేటర్ వద్ద గతేడాది జరిగిన తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసు విచారణకు హీరో అల్లు అర్జున్ వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఏ11గా ఉన్న ఆయన్ను.. నేడు విచారణకు హాజరు కావలసిందిగా నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే.. సినిమా షూటింగ్ కారణంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేక పోతున్నానని అల్లు అర్జున్ అభ్యర్థనను ఆయన తరపు లాయర్ కోర్టుకు వివరించారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. వర్చువల్ గా అల్లు అర్జున్ ను విచారించిన కోర్టు.. తదుపరి విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేసింది.
సోమవారం ఉదయం ఈ కేసు విచారణకు అల్లు అర్జున్ గైర్హాజరైనట్లు వార్తలొచ్చాయి. ఉదయం కోర్టు సూచించిన సమయానికి అల్లు అర్జున్ విచారణ హాజరు కాకపోవడంతో.. ఆయన తరపు న్యాయవాదులు వర్చువల్ విచారణకు అనుమతించాలని కోరారు. అలాగే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆబ్సెంట్ పిటిషన్ వేశారు. జులై 6వ తేదీన కూడా ఆయన వర్చువల్ గానే విచారణకు హాజరవుతారని ఉదయం వేసిన పిటిషన్ లోనే పేర్కొన్నట్లు సమాచారం.






