- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీ రేణుక మాత ఎల్లమ్మ ఆలయంలో చోరీ
శ్రీ రేణుక మాత ఎల్లమ్మ దేవాలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

దిశ, సదాశివనగర్: ఈ నెల 20వ తేదీ రాత్రి సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ రేణుక మాత ఎల్లమ్మ దేవాలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. చోరీ అనంతరం సొత్తుతో బయటకు వచ్చిన నిందితులు తెల్లవారిపోవడంతో పోలీసులకు చిక్కిపోతామనే భయంతో తాము వచ్చిన హీరో ప్యాషన్ ప్రో మోటార్ సైకిల్ (ఏపీ 09 బీఎస్ 5800), దేవాలయ హుండీ, అమ్మవారి వెండి కండ్లను సమీపంలోని పొదల్లో దాచిపెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం చీకటి పడిన తర్వాత ప్రశాంతంగా సొత్తును తరలించాలనే ఉద్దేశంతో సోమవారం తెల్లవారుజామున తిరిగి ఆ ప్రాంతానికి వచ్చి పొదల్లో దాచిన బైక్, హుండీ, ఇతర వస్తువులను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “ఆపరేషన్ కవచ్”లో భాగంగా సదాశివనగర్ పోలీసులు పద్మాజీవాడి ఎక్స్ రోడ్ వద్ద పటిష్టమైన బ్యారికేడ్లతో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను అనుమానాస్పదంగా గుర్తించి ఆపి తనిఖీ చేయగా, వారి వద్ద దేవాలయ హుండీ, అమ్మవారి వెండి కండ్లు లభించాయి. దీంతో చోరీ ఘటనలో వారి ప్రమేయం వెలుగులోకి రావడంతో నిందితులు ఉప్పల నాగరాజు, తవటం సంతోష్‌లను పోలీసులు రికవరీ సొత్తుతో పాటు రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై పుష్పరాజు తెలిపారు.






