Lucknow: కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది దుర్మరణం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-22 11:43:17  IST  )

కోచింగ్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

Lucknow: కోచింగ్ సెంటర్లో  భారీ అగ్నిప్రమాదం.. 11 మంది  దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ పరిధిలో ఉన్న పురనియా ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో భవనంలో చిక్కుకున్న బాధితుల్లో కొందరు ప్రాణభయంతో భవనం పైనుంచి దూకగా.. వారికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న బాధితుల్లో కొందరిని రక్షించగా.. వారికి కాలిన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన భవనంలో కోచింగ్ సెంటర్ కమ్ గేమింగ్ జోన్ ఉండటంతో పదుల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు చిక్కుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య పెరిగే ఛాన్సున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అగ్నిప్రమాదంలో ఏడుగురు మరణించడంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని పోలీస్ అధికారులు, ఫైర్ సిబ్బంది, స్థానిక ప్రభుత్వ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Next Story