మా ఆయనే దొరికాడా.. ఏమైనా అయితే చూస్తూ ఊరుకోను: మాధురి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-22 12:20:16  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించిన కేసు విచారణకు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హాజరయ్యారు...

మా ఆయనే దొరికాడా..  ఏమైనా అయితే చూస్తూ ఊరుకోను: మాధురి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan)పై చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించిన కేసు విచారణకు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(Mlc Duvvada Srinivas) హాజరయ్యారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ విచారణపై ఆయన ప్రియురాలు దివ్వెల మాధురి(Duvvada Madhuri) ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద హల్ చేశారు. దీంతో ఆమెతో పాటు దువ్వాడ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.

మా ఆయనే దొరికాడా..?

ఈ సందర్భంగా దువ్వాడ మాధురి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో మరే క్రైమ్‌లు లేవా అని ప్రశ్నించారు. పోలీసులకు తమ ఆయనే దొరికాడా అని మండిపడ్డారు. దువ్వాడ శ్రీనివాస్‌కి ఏమైనా అయితే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ‘‘ నా ఆయన్ని ఇంతలా హింసిస్తున్న ఆ నా కొడుకులను వదలను. ఎప్పుడో ఫిర్యాదు చేస్తే ఇప్పుడు నోటీసులు ఇస్తారా. మా ఆయన చేసింది తప్పు అయితే పవన్ కళ్యాణ్ చేసింది కూడా తప్పు కాదా. పవన్ జగన్ని తిట్టొచ్చు.. శ్రీను పవన్‌ను తిట్టకూడదా.’’ అని ఆమె ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు అవినీతి బాగోతాన్ని బయట పెట్టినందుకే తమకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఇలాంటివి ఎన్ని ఇచ్చినా అవసరమైతే విచారణకు తాను కూడా రెడీగా ఉన్నానని మాధురి వ్యాఖ్యానించారు.

Next Story