వెల్దుర్తిలో కంపుకొడుతున్నడబుల్ బెడ్ రూమ్ కాలనీ

by Kodari Anjali |

వెల్దుర్తి మండల కేంద్రంలో గల ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో సమస్యలు కంపు కొడుతున్నాయి.

వెల్దుర్తిలో కంపుకొడుతున్నడబుల్ బెడ్ రూమ్ కాలనీ
X

దిశ, వెల్దుర్తి: వెల్దుర్తి మండల కేంద్రంలో గల ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో సమస్యలు కంపు కొడుతున్నాయి. డబుల్ బెడ్ రూమ్ నిర్మించిన కాంట్రాక్టర్ డ్రైనేజీని సక్రమంగా నిర్మించకపోవడం లబ్ధిదారులు వాడుకునే మరుగుదొడ్ల పైపులలో పూర్తిగా రోత జామ్ కావడం పైపుల లీకేజీతో రోడ్డుపైనే మురుగునీరు వెళ్లడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు మహిళలు తెలిపారు. కాలనీలో పారిశుద్ధం లోపించింది. ఇల్లచుట్టుముట్టు పిచ్చి మొక్కలు పెరిగి విష పురుగులు తమ ఇందులోకి వస్తున్నాయని లబ్ధిదారులు తెలిపారు. కాలనీలో ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా నిర్మించిన మంచినీటి ట్యాంక్ లీకేజీ సమస్య ఏర్పడడంతో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. నీటి కోరతతో చుట్టుపక్కల పొలాల్లో ఉన్న బోరుబావులు నుండి నీటిని తెచ్చుకుంటున్నామని మహిళలు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ సమస్యను తీర్చాలని కాలనీవాసులు మొరపెట్టుకుంటున్నారు.

Next Story