- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షూటింగ్ మొదలు కాకముందే ఊహించని ట్విస్ట్.. అనిల్ రావిపూడి టీమ్ షాకింగ్ హెచ్చరిక
మా సినిమా పేరుతో ఒక నకిలీ కాస్టింగ్ కాల్ సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది.

దిశ, సినిమా: టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఒక భారీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈరోజే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించుకుంది. అయితే, సినిమా పట్టాలెక్కిన మొదటి రోజే ఈ మూవీ చుట్టూ ఒక వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో నటించే నటీనటుల కోసం చిత్ర యూనిట్ 'కాస్టింగ్ కాల్' విడుదల చేసినట్లు కొన్ని పోస్టులు గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం కాస్తా వైరల్ అవ్వడంతో చిత్ర బృందం వెంటనే అప్రమత్తమైంది. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలన్నీ ముమ్మాటికీ పుకార్లని, అవన్నీ నకిలీ ప్రకటనలని మేకర్స్ కొట్టిపారేశారు.
ఈ మేరకు వారు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ‘‘మా సినిమా పేరుతో ఒక నకిలీ కాస్టింగ్ కాల్ సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఆ కాస్టింగ్ కాల్‌కు మా చిత్ర బృందానికి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి అలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మకండి. మా సినిమా తరపున కాస్టింగ్ పేరుతో సంప్రదిస్తున్న వ్యక్తులకు మీ వ్యక్తిగత వివరాలు, ఫొటోలు పత్రాలు లేదా డబ్బు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. మా చిత్రానికి సంబంధించిన ఏవైనా అధికారిక కాస్టింగ్ ప్రకటనలు ఉంటే.. అవి కేవలం మా అధికారిక, ధృవీకరించబడిన సోషల్ మీడియా హ్యండిల్స్ ద్వారానే ప్రకటించబడతాయి. జాగ్రత్తగా ఉండండి, మోసగాళ్ల బారిన పడవద్దు’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వెంకటేష్, కళ్యాణ్ రామ్ అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకున్న వారంతా అలర్ట్ అవుతున్నారు.






