సోషల్ మీడియా అకౌంట్స్ సెట్టింగ్స్ మార్చండి.. వీసా దారులకు అమెరికా అలర్ట్

by Naga Rani Yarlagadda |

ఉన్నత చదువులు చదివేందుకు ఎవరికైనా మొదట గుర్తొచ్చేది అమెరికా. అమెరికాలో విద్య కోసం వెళ్లాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు.. విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

సోషల్ మీడియా అకౌంట్స్ సెట్టింగ్స్ మార్చండి.. వీసా దారులకు అమెరికా అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉన్నత చదువులు చదివేందుకు ఎవరికైనా మొదట గుర్తొచ్చేది అమెరికా. అమెరికాలో విద్య కోసం వెళ్లాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు.. విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. వీసా దరఖాస్తుదారులకు సంబంధించి కొత్త సూచనలు, నిబంధనలు వెల్లడించింది.

అమెరికా విదేశాంగశాఖ తాజా ప్రకటనలో.. విద్యార్థులతో పాటు పర్యాటక వీసాదారులు, ఇతర కేటగిరీలకు చెందిన దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను “పబ్లిక్” సెట్టింగ్‌లో ఉంచాలని సూచించింది. వీసా వెట్టింగ్ (Visa Setting), స్క్రీనింగ్ ప్రక్రియలో ఇది కీలకంగా మారనున్నట్లు వెల్లడించింది.

“అమెరికా వీసా అనేది హక్కు కాదు. అది ఒక ప్రివిలేజ్ మాత్రమే. దేశ భద్రతకు ముప్పుగా మారే వారిని గుర్తించేందుకు మేము అందుబాటులో ఉన్న అన్ని సమాచార వనరులను ఉపయోగిస్తాం” అని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా.. దరఖాస్తుదారుల ఆన్‌లైన్ ప్రవర్తన, సోషల్ మీడియా యాక్టివిటీ, ప్రొఫైల్ సమాచారం మొదలైన అంశాలను స్క్రీన్ చేయనున్నట్లు తెలిపింది. అలాగే.. ఎఫ్ (F), ఎం (M), జే (J) వీసాల ఇంటర్వ్యూలు త్వరలోనే షెడ్యూల్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. వీసా అప్లై చేయదలచిన విద్యార్థులు సంబంధిత ఎంబసీ లేదా కాన్సులేట్ వెబ్‌సైట్‌లను పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు.

అమెరికా చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. “వీసా జారీ అయిన తరువాత కూడా స్క్రీనింగ్ కొనసాగుతుంది. మాదకద్రవ్యాలు, అసంబద్ధ ప్రవర్తన, లేదా మోసపూరిత కార్యకలాపాల్లో పాల్గొనేవారు వీసా రద్దుకు గురవుతారు” అని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.

Next Story