అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

by Mahesh |   ( Updated:2025-05-10 02:47:21.0  )
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డానాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన నిర్ణయాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచ దేశాలపై ట్రంప్ తీసుకున్న ప్రతీకార సుంకాలతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాల అమలును 90 రోజులు వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం ట్రంప్ మరో సంచలన ప్రకటన (Another sensational announcement by Trump) చేశారు. ట్రంప్ "అమెరికా చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ కార్యక్రమం"ను ప్రారంభించాలని గతంలో వాగ్దానం చేశారు. కాగా దీనిపై ట్రంప్ ఓ వీడియోను విడుదల చేశారు.

అందులో ట్రంప్ మాట్లాడుతూ.. మొట్టమొదటి స్వీయ-బహిష్కరణ (irst-ever self-deportation program.) కార్యక్రమం"ను ప్రారంభించడానికి కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసినట్లు పేర్కొన్నారు. అక్రమ విదేశీయులు ఆకస్మిక బహిష్కరణతో సహా శిక్షలను ఎదుర్కొంటారని, అలాంటి వారు వెంటనే తమ "ఉచిత విమానాన్ని బుక్ చేసుకోవాలని" పిలుపునిచ్చారు. ప్రకటన ట్రంప్ యొక్క విస్తృత వలస విధానాల్లో భాగంగా ఉంది. ఇది అతని రెండవ పరిపాలనలో స్థిరమైన దృష్టిని కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో ఉన్న అక్రమ వలస దారుల్లో ఆందోళన నెలకొంది. కాగా యూఎస్ వ్యాప్తంగా భారతీయులు కూడా వేలల్లో అక్రమంగా ఉన్నట్లు ఇటీవల పలు నివేదికలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed