- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుద్ధం ముగిసింది.. శాంతి ఒప్పందంపై అమెరికా - ఇరాన్ సంతకాలు
అంతర్జాతీయ రాజకీయాల్లో ఇదో చారిత్రక మైలురాయి. అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధానికి తెరపడింది.

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ రాజకీయాల్లో ఇదో చారిత్రక మైలురాయి. అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధానికి తెరపడింది. ఇరు దేశాల నాయకులు కీలకమైన శాంతి ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వైట్ హౌస్ వెల్లడిస్తూ.. ఎక్స్ లో వీడియో పోస్ట్ చేసింది. ఫ్రాన్స్‌లోని వర్సయిల్స్‌లో జి-7 (G7) దేశాల అధినేతలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇరాన్‌తో కుదిరిన కీలక అవగాహన ఒప్పందం (MoU) పై బుధవారం సంతకం చేశారు. ఈ ఒప్పందంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా సంతకం చేసినట్లు వైట్‌హౌస్ వర్గాలు ధృవీకరించాయి. అంతకుముందు జూన్ 14నే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ గాలిబాఫ్ ఈ ఒప్పందంపై ఎలక్ట్రానిక్ పద్ధతిలో సంతకాలు చేశారు. ప్రస్తుతం ఈ తాత్కాలిక ఒప్పందం అమలులోకి వచ్చిందని, ఇరుదేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి వీలుగా 60 రోజుల గడువు ప్రారంభమైందని వైట్‌హౌస్ ప్రకటనను ఉటంకిస్తూ BBC పేర్కొంది.
14 అంశాలతో చేసుకున్న ఈ శాంతి ఒప్పందానికి.. ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ between ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని పేరు పెట్టారు. కాగా.. ఒప్పందంపై సంతకం చేయడానికి కేవలం ఒక రోజు ముందు, జీ-7 సదస్సు పత్రికా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, ఒకవేళ ఇరాన్ తన నిబద్ధతను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ చారిత్రాత్మక పరిణామానికి మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గురువారం స్పందిస్తూ, ఈ 'ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం' తక్షణమే అమలులోకి వచ్చిందని సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) ద్వారా ప్రకటించారు. ఇరు దేశాల అధ్యక్షుల సంతకాలతో పాటు, మధ్యవర్తిగా తాను కూడా ఈ ఒప్పందాన్ని ఆమోదించినట్లు ఆయన పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా మొదటి దశగా ఇరాన్ తక్షణమే 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (హార్ముజ్ జలసంధి) ద్వారా నౌకాయానాన్ని పునరుద్ధరిస్తుందని, అదే సమయంలో అమెరికా కూడా ఇరాన్‌పై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేస్తుందని షరీఫ్ వెల్లడించారు. శాంతియుత చర్చల ద్వారా యుద్ధ వాతావరణాన్ని ముగించడానికి కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్య నీతిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.






